న్యూ అమ్మ హాస్పటల్ సీజ్ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్

న్యూ అమ్మ హాస్పటల్ సీజ్ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్



01.09.26: మెదక్, నర్సాపూర్: మెదక్ రోడ్ లో వున్న న్యూ అమ్మ హాస్పటల్ చిన్న పిల్లల మరియు జనరల్ హాస్పటల్ ను కలెక్టర్  ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్, డిప్యూటి డి.ఎం.హెచ్.ఓ. డా.సృజన, ప్రోగ్రాం ఆఫీసర్ డా.జయశ్రీ, డెమో ఇన్చార్జి అన్వర్ ఇన్స్పెక్షన్ చేసి నోటీస్ జారీ చేశారు. హాస్పటల్ నడుపుకొనుటకు  ప్రాథమికమైన రిజిస్ట్రేషన్ కోసం కనీసం డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లు జిల్లా హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్ మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి అనుమతి కోసం ధరఖాస్తు చేసుకోకుండానే,  అనుమతి లేకుండానే హాస్పటల్ గత నెల రోజులుగా పూర్తి స్థాయిలో నడిపిస్తున్న కారణంగా  ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి, హాస్పటల్ ఓ.పి., ఐ.పి. రిజిష్టర్లను, పేషెంట్లను పరిశీలించి హాస్పటల్ డాక్టర్ ఎల్.కిరణ్ కుమార్ ను విచారించి నోటీసులు జారీ చేశారు. హాస్పటల్ ను వెంటనే మూసివేసి నోటీస్ కు గడువులోపు జవాబు ఇవ్వాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్ హెచ్చరించారు.

Comments

Popular posts from this blog

కూరగాయలు అమ్ముకొని ఇంటికి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి – నలుగురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ మహిళా ఉద్యోగి మృతి, అందిన పిర్యాదు మేరకు ప్రమాద కారణాలు అన్వేషిస్తున్న పోలీసులు