Posts

Showing posts from November, 2026

శివ్వంపేట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసి, పలు సూచనలు చేసిన తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్

Image
23.11.26: మెదక్, శివ్వంపేట: తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులను, పరిసరాలను మరియు సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. డీఎస్పీ పరిశీలించిన ముఖ్యాంశాలు:  * స్టేషన్ పరిధిలోని క్లోజ్డ్ క్రైమ్ ఫైల్స్ మరియు కోర్టులో విచారణలో ఉన్న పెండింగ్ ట్రయల్ కేసుల వివరాలను పరిశీలించారు.  * దర్యాప్తులో ఉన్న పెండింగ్ కేసుల పురోగతిని సమీక్షించారు.  * కానిస్టేబుల్ కిట్లు మరియు సిబ్బంది నిర్వహణ రికార్డులను తనిఖీ చేశారు.  * నేరాలకు సంబంధించిన వాహనాలు మరియు స్టేషన్ ఆవరణలో ఉన్న వారసులు లేని వాహనాలను పరిశీలించారు.  * సస్పెక్ట్ షీట్లు, రౌడీ షీట్లను సమీక్షించి, హిస్టరీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. సిబ్బందికి డీఎస్పీ ఆదేశాలు:  * పెండింగ్‌లో ఉన్న ఆస్తి నేరాల కేసులను త్వరితగతిన ఛేదించాలని ఆదేశించారు.  * పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, సకాలంలో పరిష్కరించాలని సూచించారు.  * హిస్టరీ షీట్లను సక్రమంగా నిర్వహిస్తూ, ఎప్పటికప్పుడు సమీక్షించాలని స్పష్టం చేశారు.  * ప్రజల నుండి వచ్చే ప్రతి డయల్-112 కాల్‌కు త...

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ మహిళా ఉద్యోగి మృతి, అందిన పిర్యాదు మేరకు ప్రమాద కారణాలు అన్వేషిస్తున్న పోలీసులు

Image
 23.11.26: మెదక్, నర్సాపూర్: పట్టణ పరిధిలో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 28 సంవత్సరాల యువతి మృతి చెందిన సంఘటనపై తమకు అందిన సమాచారం / పిర్యాదుపై పోలీసులు విచారణ ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట పట్టణానికి చెందిన కోడూరి నర్సింలు (55) చిన్న కుమార్తె కోడూరి సుష్మ (28) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ ఉప్పల్‌లోని ఒక హాస్టల్‌లో నివసిస్తోంది. ఈ నెల 20.11.26న రాత్రి సుమారు 11:00 గంటలకు హైదరాబాద్ నుంచి సిద్దిపేటలోని తన ఇంటికి వచ్చిన సుష్మ, 22.11.2026న మధ్యాహ్నం సుమారు 3:00 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. ఈ క్రమంలో 23.11.2026న తెల్లవారుజామున సుమారు 06:00 గంటల సమయంలో నర్సాపూర్ పట్టణ పరిధిలో ఒక కారు తో జరిగిన రోడ్డు ప్రమాదంలో సుష్మ మృతి చెందినట్లు, ఆమె మృతదేహాన్ని నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు ఉదయం సుమారు 10:00 గంటలకు ఆమె తల్లి జ్యోతికి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ద్వారా సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే కుటుంబ సభ్యులు నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని తమ కు...

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి – ప్రమాద సమాచారం తెలిసిన వారు తెలుపుటకు పోలీసుల విజ్ఞప్తి

Image
  23.11.26: మెదక్, నర్సాపూర్: పట్టణంలోని NH-765D జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 64 సంవత్సరాల వృద్ధుడు మృతి చెందిన ఘటనపై నర్సాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. నర్సాపూర్ పట్టణంలోని శివాలయం వీధికి చెందిన వడ్డె ఎల్లయ్య తండ్రి క్రీ. శే. సలయ్య, వయస్సు; 64 సం ,, వృత్తి: లేబర్, కులం; వడ్డె; నివాసం; శివాలయం స్ట్రీట్, నర్సాపూర్ టౌన్, మెదక్ జిల్లా, ఈ నెల 22.11.2026 రాత్రి సుమారు 11:00 గంటల సమయంలో తన TVS XL ద్విచక్ర వాహనం పై సిగరెట్ కొనుగోలు చేసేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో 23.11.2026 నాడు రాత్రి సుమారు 02:45 గంటల సమయంలో చౌరస్తా నుండి మెదక్ రోడ్డులో బాలాజీ ఫుట్‌వేర్ షాపు ఎదురుగా, ఆ వైపు వెళ్లే NH-765D రహదారిపై గుర్తుతెలియని వాహనం ఆయన ద్విచక్ర వాహనాన్ని ఢీకొని, తలకు, కుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన వాహనం ఆగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ఎల్లయ్యను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెం...

పోలియో రహిత సమాజం నిర్మిద్దాం పోలియో చుక్కలు వేయించడం తప్పని సరి

Image
22.11.26: సంగారెడ్డి: ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజం నిర్మిద్దాం అని ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర అన్నారు. స్థానిక యువనాయకుడు మున్వార్ తో కలిసి పట్టణ పరిధిలోని ఇందిరా కాలనీ ప్రైమరీ స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలియో చుక్కల కేంద్రాన్ని సందర్శించిన అనంతరం మాట్లాడుతూ.. చిన్నారుల మెరుగైన ఆరోగ్యం, పరిరక్షణ బాధ్యత తల్లి తండ్రులు తీసుకోవాలని అవగాహన కల్పించారు. ఇట్టి కార్యక్రమంలో వైద్య సిబ్బంది, హెల్త్ వాలంటీర్స్ స్థానికులు అన్వార్ ఖాన్, షాకీర్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో Elnino ప్రత్యేక వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు రైతులకు ప్రిపరేషన్

Image
 21.11.26: మెదక్, నర్సాపూర్: మండలంలోని అద్మాపూర్ మరియు జక్కపల్లి గ్రామాలలో  ఎల్-నినో ప్రభావాలు, నీటి సంరక్షణ మరియు స్థిరమైన వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల  వ్యవసాయ అధికారిణి దీపిక రైతులకు ఎల్-నినో ప్రభావం కారణంగా వర్షపాతం తగ్గే అవకాశాలు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక, పంటల వైవిధ్యీకరణ, నీటి సంరక్షణ పద్ధతులు, స్థిరమైన వ్యవసాయ విధానాలపై వివరించారు. రైతులు తక్కువ నీటి వినియోగంతో సాగు చేసుకునే పంటల వైపు మొగ్గు చూపాలని, వరి సాగును తగ్గించి **జీరో ప్యాడీ (Zero Paddy) సాగు విధానాన్ని** ప్రోత్సహించాలని సూచించారు. ఆరుతడి పంటలు అయినటువంటి జొన్న, మొక్కజొన్న, పెసర, అలసంద, మినుము, శనగ, నువ్వులు, కుసుమ, పొద్దుతిరుగుడు, ఆవాలు, కూరగాయల సాగు ప్రాధాన్యత, ఆయిల్ పామ్ సాగు ద్వారా కలిగే ప్రయోజనాలు, సూక్ష్మ నీటిపారుదల పద్ధతులు, నీటి పొదుపు మరియు అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. వాతావరణ మార్పులు మరియు భవిష్యత్తులో ఎదురయ్యే నీటి కొరతను దృష్టిలో ఉంచుకొని రై...

కూరగాయలు అమ్ముకొని ఇంటికి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి – నలుగురికి గాయాలు

Image
   17.11.26: మెదక్, నర్సాపూర్: నిన్న (16.11.26) రాత్రి సుమారు 08:10 గంటల సమయంలో NH-765D జాతీయ రహదారిపై నర్సాపూర్ - గుమ్మడిదల్ల అటవీ ప్రాంత పరిధిలోని కాసిల ఫార్మ్స్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, దౌల్తాబాద్ కూరగాయల మార్కెట్‌ లో వ్యాపారం ముగించుకున్న ఐదుగురు వ్యక్తులు ఒక ఆటోలో తమ స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా, హైదరాబాద్ వైపు వెళ్లే రహదారిపై ఎటువంటి హెచ్చరిక సూచికలు, ఇండికేటర్లు లేకుండా రోడ్డు పక్కన నిలిపి ఉంచిన టిప్పర్ లారీని ఆటో వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. మృతురాలి వివరాలు: రాజిపేట రాములమ్మ, భర్త శంకరయ్య, వయస్సు 55 సంవత్సరాలు, వృత్తి: కూరగాయల వ్యాపారం. గాయపడిన వారి వివరాలు: 1. రాజిపేట శంకరయ్య, వయస్సు 60 సంవత్సరాలు – తలకు మరియు శరీరంలోని కుడి వైపున తీవ్ర గాయాలయ్యాయి. 2. గండ్ల జీతయ్య, వయస్సు 57 సంవత్సరాలు – ఎడమ భుజంపై మరియు శరీరంపై గాయాలయ్యాయి. 3. వాలమల శోభారాణి, వయస్సు 48 సంవత్సరాలు – తలకు మరియు ముఖంపై గాయాలయ్యాయి. 4. జలిగామ బాలమణి, వయస్సు 52 సంవత్సరాలు – తలక...

సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసి పలు సూచనలు చేసిన తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్

Image
16.11.26: మెదక్, నర్సాపూర్: తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసి, సర్కిల్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న అండర్ ఇన్వెస్టిగేషన్ (UI) కేసులు మరియు పోలీస్ స్టేషన్ రికార్డులను సమీక్షించారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసులను త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి పరిష్కరించాలని, గ్రామాలు మరియు పట్టణ ప్రాంతాల్లో కమ్యూనిటీ సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు. అదేవిధంగా ఆస్తి సంబంధిత నేరాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.

శ్రీ వత్సల్ గురుకుల పాఠశాల బస్సు ప్రమాదానికి కారణం అయిన బాధ్యతలేని యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి

Image
14.11.26: మెదక్, నర్సాపూర్: బాలల దినోత్సవం రోజునే పట్టణంలోని ఓ ప్రైవేటు విద్యా సంస్థ అయిన శ్రీ వత్సల్ గురుకుల పాఠశాలకు చెందిన స్కూల్ బస్ ప్రమాదానికి గురై చిన్నారుల్లో ఆందోళనకు కారణం అయ్యింది. సాయంత్రం పాఠశాల సమయం అయిపోయాక విద్యార్థులందరూ తమ తమ ఇండ్లకు వెళ్లడానికి బస్సు ఎక్కగా.. డ్రైవర్ ప్రభాకర్ బస్సును తోలుతూ.. కొద్ది దూరం నడిపి ఫిట్స్ కు గురయ్యాడు. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ఓ ఆటో, మూడు ద్విచక్ర వాహనాలను తగులుతూ ముందుకు దూసుకెళ్లింది. బస్సు చక్రాల కింద ఓ బైక్ పడడంతో బస్సు వేగం తగ్గగా.. బస్సులో ఉన్న క్లీనర్ అప్రమత్తమై బస్సును పూర్తిగా నిలిపివేశాడు. ఈ ప్రమాదంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురై ఏడుపులతో ఆహాకారాలు చేశారు. ఇది గమనించిన అక్కడ ఉన్న స్థానికులు బస్సులోని విద్యార్థులను కిందికి దింపేశారు. ప్రమాదం జరిగే సమయంలో బస్సులో 30 కి పైగా విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. బస్సు అదే విధంగా వెళ్ళి ఉన్నట్లు అయితే..ప్రక్కనే ఉన్న రెండు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ లను డీ కొట్టి ఉండేదని, అదే జరిగి ఉంటే చాలా ఘోరం జరిగి ఉండేదని స్థానికుల అభిప్రాయం. ఆరోగ్య పరిస్థితి బాగాలేని డ్రైవర్ను విధుల్...

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు, సద్వినియోగం చేసుకొని జీవితాలలో వెలుగులు నింపుకోవాలన్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి

Image
 14.11.26: మెదక్: జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు వారం రోజుల పాటు ఈ వారోత్సవాలను నిర్వహించనున్నారు. తొలిరోజు కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి వారోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మెదక్ మున్సిపల్ చైర్మన్ కానుగు రాధిక భూపతిరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిలుముల సుహాసిని రెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞానాన్ని అందించే దేవాలయాలని, విద్యార్థులు, యువత పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని అన్నారు. చదువు ద్వారా వ్యక్తిత్వ వికాసంతో పాటు సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిలో పఠనాసక్తిని పెంపొందించడమే గ్రంథాలయ వారోత్సవాల ప్రధాన లక్ష్యమని తెలిపారు. నవంబర్ 14 నుంచి 20 వరకు నిర్వహించే ఈ వారోత్సవాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, నాయకులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

శ్రీ పోతులూరి వీర బ్రహ్మంగారి విగ్రహ ధ్వంస నిందితులను కఠినంగా శిక్షించాలి అని విశ్వబ్రాహ్మణ, విశ్వ కర్మల నిరసన ర్యాలీ, పార్టీలకు అతీతంగా మద్దతుగా నిలిచిన నాయకులు

Image
 14.11.26: మెదక్, నర్సాపూర్: మెదక్ ప్రధాన రహదారిలోని చిన్న చింతకుంట బస్ స్టేజ్ సమీపంలో ఉన్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే గుర్తించి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ చిన్న చింతకుంట బస్సు స్టేజ్ వద్ద గల శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం నుంచి ప్రారంభమై.. ప్రధాన రహదారి మీదుగా నర్సాపూర్ వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో విశ్వకర్మలు జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఈ ర్యాలీ నర్సాపూర్ అంబేద్కర్ చౌరస్తా వరకు చేరగా.. చౌరస్తాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే సునీతా రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్, బిజెపి సీనియర్ నాయకులు రఘువీరారెడ్డి, H. రాజి రెడ్డి లు హాజరై ఈ నిరసన ర్యాలీకి మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ వీరబ్రహ్మేం...

నిర్లక్ష్యంగా..అతివేగంగా కారు నడిపిన డ్రైవర్ కారణంగా ఒకరి మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు

Image
  14.11.26: మెదక్, నర్సాపూర్: పట్టణ పరిధిలోని న్యూ క్లాసిక్ గార్డెన్స్ సమీపంలో నిన్న (13.11.26)రాత్రి 11.15PM సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే, నర్సాపూర్ పట్టణం సంగారెడ్డి రోడ్ లోని న్యూ క్లాసిక్ గార్డెన్స్‌లో జరిగిన ఒక శుభకార్యానికి హాజరైన మెదక్ పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న మహమ్మద్ తాహెర్ (54), తన కుమారుడు మహమ్మద్ ఖాజా మొయినుద్దీన్ (19)తో కలిసి ద్విచక్ర వాహనంపై తిరిగి మెదక్ బయల్దేరారు. ఈ క్రమంలో న్యూ క్లాసిక్ గార్డెన్స్ నుంచి సుమారు 30 మీటర్ల దూరంలో నర్సాపూర్ నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్న గుర్తుతెలియని కారు డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా మరియు నిర్లక్ష్యంగా వాహనాన్ని నడుపుతూ ఎదురుగా వస్తున్న వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న కుమారుడు ఖాజా మొయినుద్దీన్ ఎడమ కాలు, ముఖం మరియు శరీరంపై తీవ్ర గాయాలతో రక్తస్రావానికి గురయ్యాడు. వెనుక కూర్చున్న తండ్రి మహమ్మద్ తాహెర్ తీవ్ర గాయాల కారణంగా సంఘటనా స్థలంలోన...

పాలనలో పారదర్శకత, జవాబుదారీ తనం పెంచడంలో స.హ. చట్టం కీలకం అన్న డిఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్ @Medak

Image
11.11.26: మెదక్: కలెక్టరేట్ కార్యాలయంలో ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకతను పెంపొందించడానికి మరియు పౌరుల దరఖాస్తులను చట్టబద్ధంగా పరిష్కరించడానికి MCRHRD ఇన్‌స్టిట్యూట్ సమాచార హక్కు చట్టం (RTI Act, 2005) జిల్లా స్థాయిలో( PIOs),(APIOs ప్రత్యేక శిక్షణలను నిర్వహిస్తోందని డి ఆర్ ఓ అంబదాస్ రాజేశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా డిఆర్ఓ అంబదాస్ రాజేశ్వర్ మాట్లాడుతూ..చట్టం ప్రకారం 30 రోజుల్లో సమాచారం అందించాలని, పారదర్శకత, జవాబుదారీతనం పెంచడానికి చట్టం కీలకమని, పౌరులకు చట్టం విధానాలు, దరఖాస్తు ప్రక్రియ, సమాచారం పొందే హక్కులు గురించి వివరంగా తెలియజేశారు అని తెలిపారు. కార్యక్రమంలో శంకర్ .సెషన్‌లో పౌర సమాచార అధికారులు (PIO), సహాయ PIOలు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామికీ దళితులపై దాడులు అరికటండి అంటూ వినతిపత్రం అందించిన దళితులపై దాడుల వ్యతిరేక పోరాట కమిటీ

Image
09.11.26: మెదక్, నర్సాపూర్: జిల్లాలో దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, దాడి చేసినవారిని చట్ట ప్రకారం శిక్షించాలని జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామికీ జిల్లా దళితులపై దాడుల వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందచేశారు. ఈ సందర్బంగా కేవీపీస్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కడారి నాగరాజు, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు కల్లూరి సంజీవ, JMM రాష్ట్ర నాయకులు ఊరట్ల శివ, MCF జిల్లా నాయకులు ఆనంద్, MRPS జిల్లా సీనియర్ నాయకులు బిక్షపతి లు మాట్లాడుతూ.. మనోహరాబాద్ మండలం కొనాయిపల్లి (పి టి), కుచారం, తుప్రాన్ మండలం కిష్టాపూర్, శివ్వంపేట్ మండలం నవాబ్ పేట్ గ్రామాల్లో బతుకమ్మ ఉత్సవాల సందర్బంగా దళితులపై దాడులు, దౌర్జన్యాలు జరిగాయన్న ఆవేదన వ్యక్తం చేశారు. కొనాయిపల్లి గ్రామంలో డప్పులు కొట్టడానికి కనీస వేతనం ఇవ్వాలని అడిగినందుకు గ్రామ సర్పంచ్ మన్నే కళ్యాణ్ వారీ అనుచరులు ముకుమ్మడిగా 40 మంది దళితులపై దాడి చేసి గాయపరిచారని అన్నారు. సర్పంచ్ వారీ అనుచరులు చేసిన దాడిలో విధి నిర్వహణలో ఉన్న ముగ్గురు గ్రామ పంచాయతీ కార్మికులకు తీవ్రంగా గాయాలు అయ్యాయని గుర్తుచేసారు. కుచారం గ్రామంలో దళిత సర్పంచ్ బతుకమ్...

ఎండిన పంటలను పరిశీలించి, రైతులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటామన్న మాజీ మంత్రి హరీష్ రావు

Image
  06.11.26: మెదక్ , నర్సాపూర్: నియోజకవర్గంలోని చిలిపిచెడ్ మండలం ఫైజాబాద్ గ్రామం, హత్నూర మండలం లక్ష్మా తండా, నస్తీపూర్ గ్రామాల్లో ఎండిపోయిన వరి పంటలను మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పరిశీలించి, పంట నష్టపోయిన రైతులను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎండిపోయిన పంటలకు తక్షణమే పంట నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటామని ఈ సందర్భంగా వారు భరోసా ఇచ్చా రు.

మెదక్ ఎమ్మెల్యే జన్మదిన ఫ్లెక్సీలను చించిన వ్యక్తుల గుర్తింపు – కేసు నమోదు చేసిన పోలీసులు

Image
 06.11.26: మెదక్, నర్సాపూర్: పట్టణంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చౌరస్తా మరియు మెదక్ రోడ్ లో గుర్తుతెలియని వ్యక్తులు చించివేసిన ఘటనపై వచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలు మరియు ఇతర సమాచారంతో ఫ్లెక్సీలను చించివేసిన వ్యక్తులను గుర్తించడం జరిగింది. వారిలో: 1. మహమ్మద్ అక్బర్ – నారాయణపూర్ గ్రామం. 2. బలిజ అజయ్ కుమార్ – నారాయణపూర్ గ్రామం. 3. వెంకట సాయి – నారాయణపూర్ గ్రామం. విచారణలో భాగంగా, సదరు ఫ్లెక్సీలలో తమ ఫోటోలు ఏర్పాటు చేయలేదనే కోపంతోనే వాటిని చించివేసినట్లు వారు అంగీకరించారు అని, ఈ సందర్భంగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు లేదా ఇతరుల ఫ్లెక్సీలు, బ్యానర్లు, ఆస్తులను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేయడం చట్టరీత్యా నేరం అని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని SI రంజిత్ కుమార్ రెడ్డి తెలిపారు.