Posts

Showing posts from October, 2026

యువత తమ జీవితాలను, భవిష్యత్తును నాశనం చేసే మత్తు పదార్థాలకు, డ్రగ్ లను దూరం పెట్టాలన్న పోలీస్ అధికారులు @ నర్సాపూర్, మెదక్

Image
 31.10.26: మెదక్, నర్సాపూర్: పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో ఈ రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో *సహారా ఇండియన్ టీం vs యంగ్ స్టార్ టీం* తలపడగా ఇందులో యంగ్ స్టార్ టీం విజయం సాధించింది, విజేతలకు ASP విక్రాంత్ సింగ్, మరియు DSP నరేందర్ గౌడ్, CI రంగ కృష్ణ, SI రంజిత్ కుమార్ రెడ్డి బహుమతుల ప్రధానోత్సవంలో పాల్గొని రన్నరప్ మరియు విన్నెరప్ అయిన టీమ్లకు బహుమతులు ప్రధానం చేశారు. అనంతరం ASP మాట్లాడుతూ.. యువత మత్తు పానీయాలకు డ్రగ్స్ కు అలవాటు పడకుండా.. ఉన్నత ఆశయాలతో ముందుకు సాగాలని, రాబోయే తరాలకు ఆదర్శంగా ఉండాలని క్రీడాకారులకు, యువకులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇరు జట్ల క్రీడాకారులు మరియు నర్సాపూర్ పోలీస్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.

SIR పై అవగాహన కల్పించి, డెంటల్ క్లినిక్ ప్రారంభించిన ఎంపీ రఘు నందన్ రావు @ నర్సాపూర్, మెదక్

Image
29.10.26: మెదక్, నర్సాపూర్: జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ మల్లేష్ గౌడ్ అధ్యక్షతన ఎల్లంకి కళాశాల విద్యార్థులతో ఎస్ఐఆర్ పై ముఖాముఖి చర్చ ఏర్పాటు చేయడం జరిగింది.. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు పాల్గొని విద్యార్థులకు ఎస్ఐఆర్ పై అవగాహన కలిగించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో డెంటల్ క్లినిక్ ను ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ సంఘసని సురేష్, నాయకులు రమేష్ గౌడ్, కవిత, దిశా కమిటీ మెంబర్స్ రమేష్ గౌడ్, పద్మ, జిల్లా ఉపాధ్యక్షులు రాజేందర్, జిల్లా కోశాధికారి ఆంజనేయులు గౌడ్, బీజేపీ నర్సాపూర్ పట్టణ కన్వీనర్ ప్రేమ్ కుమార్ యాదవ్, మండల అధ్యక్షులు నాగ ప్రభు, దాసు, నగేశ్,బీజేపీ సీనియర్ నాయకులు, వివిధ మోర్చా అధ్యక్షులు శక్తి కింద ఇంచార్జిలు, బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు.

ఎల్నినో పరిస్థితులు ఎదుర్కోవడానికి వీడియో కాన్ఫరెన్స్ లో పలు సూచనలు చేసిన మంత్రి సీతక్క, దాన కిషోర్, దివ్య దేవ రాజన్ లు.

Image
28.10.26: మెదక్, నర్సాపూర్: రైతు వేదికలో పంచాయతీ రాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ మంత్రి సీతక్క మరియు పంచాయతీరాజ్ అండ్ డెవలప్మెంట్ కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎల్నీనో పరిస్థితులను ఎదుర్కోవడానికి చేపట్టవలసిన కార్యక్రమాలను రాష్ట్ర రాజధాని నుండి వివరించడం జరిగింది. ఎల్నివో మరియు VBG RAMG లో ఉపాధి లేబర్ ను పెంచడం, జలసీరి కి సంబందించిన FARM PONDS, ఇంటింటికి ఇంకుడుగుంత, కమ్యూనిటీ సోక్ పిట్స్, Borewell రీఛార్జ్ Structures, డ్రైన్ చివర సోక్ పిట్స్, VO భవనాలు, అంగన్వాడీ భవనాలు, గ్రామపంచాయతీ భవనాలు నిర్మాణం గురించి సీతక్క, Special Chief Secretry దాన కిషోర్, పంచాయతీ రాజ్ కమిషనర్ దివ్యాదేవరాజన్ లు చెప్పడం జరిగినది. కార్యక్రమంలో ఎంపీడీవో భారతి, ఎంపీఓ, మండల వ్యవసాయ అధికారి దీపిక, డి ఈ పంచాయతీరాజ్, సర్పంచులు మరియు కార్యదర్శులు పాల్గొనడం జరిగింది.

దీర్ఘకాలిక కడుపునొప్పితో బాధ పడుతూ..ఉరేసుకున్న యువకుడి మృతి. ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం కాబోదు అంటున్న పోలీసులు

Image
 28.10.26: మెదక్, నర్సాపూర్: పట్టణానికి చెందిన సురారం రమేష్ కుమార్ S/o సురారం యాదయ్య, వయస్సు 40 సంవత్సరాలు, కులం: ఎస్సీ (మన్నె), వృత్తి: ప్రైవేట్ ఉపాధ్యాయుడు, స్వస్థలం: నర్సాపూర్ పట్టణం, మెదక్ జిల్లా, తేదీ 28.10.2026 తెల్లవారుజామున తన నివాసంలో మృతి చెందిన ఘటనకు సంబంధించి నర్సాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందింది. మృతుడు మొహమ్మదాబాద్‌లోని ఎస్టీ గురుకుల పాఠశాలలో ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. సుమారు 15 సంవత్సరాల క్రితం సురారం సుష్మ (34)ను వివాహం చేసుకోగా, వారికి సురారం సాయి కుమార్ (10), వర్ణిక (8) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఫిర్యాదుదారుడు, మృతుడి తండ్రి సురారం యాదయ్య,  తెలిపిన వివరాల ప్రకారం, రమేష్ కుమార్ గత నాలుగు సంవత్సరాలుగా కడుపునొప్పితో బాధపడుతూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందినప్పటికీ ఉపశమనం లభించలేదు. తేదీ 27.10.2026న విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన అనంతరం కూడా కడుపునొప్పితో బాధపడుతున్నట్లు భార్యకు, తండ్రికి తెలిపాడు. ఆసుపత్రికి వెళ్లాలని తండ్రి సూచించగా, మరుసటి రోజు ఉదయం వెళ్తానని చెప్పాడు. తేదీ 28.10.2026 తెల్లవారుజామున సుమారు 05:00 గంటలకు మృతుడి కుమారుడు ...

ప‌నితీరులో మార్పు రాక‌పోతే క‌ఠిన‌చ‌ర్య‌లు త‌ప్ప‌వు, భూ సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని సహించేది లేదు అన్న మంత్రి పొంగులేటి @ ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశం, సంగారెడ్డి

Image
  *భూ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి* *క్షేత్రస్థాయిలో సర్వేను పరిశీలించి రైతులకు భూమి విస్తీర్ణంపై స్పష్టత ఇవ్వాలి* *రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించబోం* *పెండింగ్ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి*  *పేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం* *రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి* సంగారెడ్డి, అక్టోబర్ 27:- రెవెన్యూ ఉద్యోగులు స‌క్ర‌మంగా, బాధ్య‌తాయుతంగా ప‌నిచేసిన‌ప్పుడే ప్ర‌జ‌ల ముఖ్యంగా రైతుల స‌మ‌స్య‌లు తీరుతాయ‌ని ఈ విష‌యంలో ఇప్ప‌టికే ప‌లుమార్లు రెవెన్యూ ఉద్యోగుల‌ను ఆదేశించిన‌ప్ప‌టికీ పూర్తిస్దాయి ఫ‌లితాలు క‌నిపించ‌లేద‌ని భ‌విష్య‌త్తులో మార్పురాక‌పోతే అధికారులు, ఉద్యోగుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హెచ్చరించారు.  ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాలోని రెవెన్యూ, రిజిస్ట్రేష‌న్, హౌసింగ్ శాఖ‌ల ప‌నితీరుపై సంగారెడ్డి జిల్లా పరిషత్ మీటింగ్ హాలులో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి...

ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో తన నియోజకవర్గపు సమస్యలు మంత్రి అధికారుల దృష్టికి తెచ్చిన MLA సునీతరెడ్డి @ సంగారెడ్డి

Image
 27.10.26: మెదక్, నర్సాపూర్: జిల్లా కేంద్రం అయిన సంగారెడ్డిలో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు అయిన ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో నర్సాపూర్ MLA సునీతరెడ్డి పాల్గొని తన నియోజకవర్గం లోని నవాబ్‌పేట, రత్నాపూర్, కొంగోడు, ఎం. జలాల్‌పూర్, రైలాపూర్ తండా గ్రామాల భూ సమస్యలు, వారిగుంతం, సంగాయిపేట, కుల్చారం, చిన్నఘనపూర్, ఎనగండ్ల, అంసాన్‌పల్లి గ్రామాల్లో పీఓటీ పట్టాల సమస్యలను, మంత్రి మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అలాగే నర్సాపూర్, దొంతి, హత్నూర ప్రాంతాల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు అందించాలని కోరడం జరిగింది.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి – మరొకరికి తీవ్ర గాయాలు @ నర్సాపూర్, మెదక్

Image
  26.10.26: మెదక్, నర్సాపూర్:  తేదీ 25.10.2026 రాత్రి సుమారు 11:10 గంటల సమయంలో నర్సాపూర్ మండలం పేద్దచింతకుంట గ్రామ శివారులోని చికెన్ షాప్ (జల హనుమాన్) సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మెదక్ జిల్లా, చిలిప్‌చెడ్ మండలం, సమ్లా తండా గ్రామానికి చెందిన మాలోత్ వినోద్ S/o మాలోత్ వాసురాం, వయస్సు 23 సంవత్సరాలు, కులం: ఎస్టీ (లంబాడి), వృత్తి: ప్రైవేట్ ఉద్యోగి, తన స్నేహితుడు బానోత్ సర్దార్ S/o దుర్గ్యా, వయస్సు 30 సంవత్సరాలు, కులం: ఎస్టీ (లంబాడి), వృత్తి: ఫోటోగ్రాఫర్, నివాసం: సమ్లా తండా గ్రామం తో కలిసి ఫోటో ఆల్బమ్ అందించేందుకు ద్విచక్ర వాహనం పై నర్సాపూర్‌కు బయలుదేరారు. వారు పేద్దచింతకుంట గ్రామ శివారుకు చేరుకున్న సమయంలో, మెదక్ నుంచి హైదరాబాద్ వైపు ఇనుప రాడ్ల లోడుతో వెళ్తున్న ఒక లారీ వెనుక భాగాన్ని వారి ద్విచక్ర వాహనం ప్రమాదవశాత్తు గా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వినోద్ తలకు మరియు శరీరంలోని ఇతర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. సర్దార్‌కు కూడా తలకు, శరీరంలోని ఇతర భాగాలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, నర్సాపూర్‌కు తరలిస్తుండగా వినోద్ మృతి చెందాడు. సర్దార్‌కు ప్రాథమి...

గుడుంబా తయారీపై దాడి చేసి – అక్రమ బెల్ట్‌షాపులపై కేసుల నమోదు చేసి ఎక్సైజ్ అధికారులు

Image
24.10.26: మెదక్, నర్సాపూర్: ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ మెదక్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ మరియు శాఖ జిల్లా అధికారి ఆదేశాల మేరకు నర్సాపూర్ ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు, దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా శివంపేట మండలంలోని పాంబండ గ్రామ సమీపంలోని భీమ్లా తండా పరిసర ప్రాంతంలో అక్రమంగా గుడుంబా (నాటుసారా) తయారు చేస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక నిందితుడిని అరెస్టు చేసి, 2 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 30 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి, సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు. అలాగే.. అనధికారికంగా ఐఎంఎల్ మద్యం విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు రెండు బెల్ట్‌షాపులపై తనిఖీలు నిర్వహించి, నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి రెండు కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా 4.32 లీటర్ల ఐఎంఎల్ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ గులాం ముస్తఫా పర్యవేక్షణలో, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ట్రైనీ ఇన్‌స్పెక్టర్ జ్ఞానేశ్వర్, ఎస్‌ఐ డి. శరత్ కుమార్, ట్రైనీ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ సచ...

దొరికిన బ్యాగులోని ఐఫోన్, రూ.10 వేల నగదు, రెండు బంగారు ఉంగరాలను యజమానికి అప్పగించి నిజాయితీ చాటుకున్న పోలీసు సిబ్బంది, అభినందించిన మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్‌

Image
24.10.26: మెదక్, పాపన్నపేట: ఏడుపాయల దేవాలయ ప్రాంగణంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది శ్రీకాంత్, భూపాల్ నిజాయితీని తమ బాధ్యతలు గుర్తెరిగి వ్యవహరించుకున్నారు. ఏడుపాయల ఆలయ గోపురం వద్ద వారికి ఒక నల్ల బ్యాగు దొరికగా.. దానిని తెరిచి చూసిన వారికి ఒక ఐఫోన్, రూ.10 వేల నగదు, రెండు బంగారు ఉంగరాలు ఆగుపించాయి. వెంటనే ఆ బ్యాగును తీసుకొని ఆలయ ఈఓ కార్యాలయానికి వెళ్లి, యజమాని కోసం వేచి ఉన్నారు. ఇంతలో కూకట్‌పల్లికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి అక్కడికి వచ్చి తన బ్యాగు పోయిందని తెలిపాడు. బ్యాగులోని వస్తువుల వివరాలను అడిగి నిర్ధారించుకున్న అనంతరం, ఆలయ ఈఓ సమక్షంలో బ్యాగును యజమానికి అప్పగించారు. దొరికిన విలువైన వస్తువులను భద్రంగా ఉంచి, వాటిని యజమానికి తిరిగి అందించిన పోలీసు సిబ్బంది శ్రీకాంత్, భూపాల్ నిజాయితీ, బాధ్యతాయుతమైన విధి నిర్వహణను మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్‌ అభినందించారు. విధి నిర్వహణలో నిజాయితీ, నిబద్ధతతో వ్యవహరిస్తూ ప్రజలకు పోలీసు శాఖపై నమ్మకాన్ని మరింత పెంచాలని ఈ సందర్భంగా సూచించారు.

ఎర్ర సూర్యుడు కామ్రేడ్ చిలుముల విట్టల్ రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి మరియు itarulu

Image
19.10.26: మెదక్, నర్సాపూర్: కీర్తిశేషులు, మాజీ ఎమ్మెల్యే, ప్రజా నాయకుడు కామ్రేడ్ చిలుముల విట్టల్ రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎర్ర సూర్యుడు కామ్రేడ్ చిలుముల విట్టల్ రెడ్డి గారు ప్రజల సంక్షేమం కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రజల హక్కుల కోసం, వారి అభ్యున్నతి కోసం ఆయన చేసిన పోరాటాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, ఆయన చూపిన మార్గంలో నడుస్తామని తెలిపారు. ప్రజాసేవకు ఆయన జీవితం ఒక ఆదర్శమని, ప్రజల హృదయాల్లో ఆయన ఎప్పటికీ నిలిచిపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్, మాజీ వైస్ ఎంపీపీ నర్సింగ్ రావు, మాజీ సర్పంచ్ రమణారావు, కౌన్సిలర్ చింతకుంట శ్రీకాంత్, రాధాకృష్ణ, మన్నె వెంకటేష్, బిక్షపతి, శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొని కామ్రేడ్ విట్టల్ రెడ్డికి ఘన నివాళులర్పించారు.

ఫుడ్ పాయిజన్ బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

Image
 ఫుడ్ పాయిజన్ బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి 17.10.26: మెదక్, నర్సాపూర్: మెదక్ రోడ్ వన్ ప్లస్ మండి రెస్టారెంట్‌లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 41 మందిని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఒకరు మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, మృతుడి కుటుంబానికి సానుభూతి తెలిపారు.

*రామాలయ ధ్వజస్థంభం ప్రతిష్టకు ప్రముఖ సంఘసేవకులు పబ్బ మహేష్ గుప్తా విరాళం*

Image
17.10.26: మెదక్, శివ్వంపేట: గ్రామములో ప్రముఖ పురాతన పుణ్యక్షేత్రం రామాలయం గుడికి ధ్వజస్థంభం ఏర్పాటుకు ప్రముఖ సంఘసేవకులు శివంపేట తాజా మాజీ ZPTC పబ్బ మహేష్ గుప్తా 50,000 ( యాభై వేలు) తన సొంత నిదుల నుండి ఈరోజు పూజారి శాస్త్రుల రాజశేఖర్ శర్మ కు అందచేసి, ధ్వజస్థంభం ఏర్పాటు రోజు భక్తులకు అన్న దాన కార్యక్రమము ఏర్పాటు చేస్తానని తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజీపేట వెంకటేశ్వర్ ఉపసర్పంచ్ ఇసుగారి మల్లేష్, వార్డు సభ్యులు ముయడ్డి ముత్యాలు,కొవ్వురి యాదగిరి,గ్రామ శాఖ అధ్యక్షుడు ముద్దగాళ్ల లక్ష్మీ నరసయ్య,మాజీ సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్,మాజీ వార్డ్ సభ్యులు బాసంపల్లి పోచ గౌడ్ మగ్దుంపూర్ సర్పంచ్ సోము అశోక్, PMG యువసేన సభ్యులు కొత్తపేట శ్రీనివాస్ గౌడ్, సోముసాని రేవంత్, పత్రాల త్రినేష్ గౌడ్,కల్లూరి రాజు, బాలాపురం సురేష్,సాదక్ క్యాసని వెంకటేష్,తదితరులు పాల్గొన్నారు.

తమ పని తీరు తో పంచాయతీ రాజ్ డిప్యూటీ కమిషనర్ చే గౌరవించబడ్డ ఎల్లారెడ్డి గూడా తండా సర్పంచ్, సెక్రటరీ లు

Image
16.10.25: మెదక్, నర్సాపూర్: డిప్యూటీ కమిషనర్, పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ, హైదరాబాద్ పి.జె. వెస్లీ మండలంలోని ఎల్లారెడ్డిగూడ తండా గ్రామ పంచాయతీని సందర్శించి, క్రింది అంశాలను పరిశీలించారు. * గ్రామ పంచాయతీ రికార్డులు మరియు వాటి నిర్వహణ. * 15వ ఆర్థిక సంఘం (FFC) నిధులకు సంబంధించిన చెల్లింపుల ప్రక్రియ. * గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక అమలు. * గత మూడు నెలలుగా పంచాయతీ కార్యదర్శి ఆన్‌లైన్ హాజరు వివరాలు. * నాలుగు రకాల వ్యర్థాల వేరు వేరు సేకరణ మరియు నిర్వహణ. * గ్రామ పంచాయతీ ఆస్తుల పరిరక్షణ మరియు రికార్డుల నిర్వహణ. గ్రామ పంచాయతీ యొక్క మొత్తం పనితీరు మరియు కార్యకలాపాలను పరిశీలించిన అనంతరం, డిప్యూటీ కమిషనర్ సంతృప్తి వ్యక్తం చేసి, పంచాయతీ కార్యదర్శి మరియు సర్పంచ్ ల కృషిని అభినందిస్తూ శాలువాలతో సత్కరించారు. తర్వాత ఘన వ్యర్థాల నిర్వహణ (SWM) షెడ్, వ్యర్థాల వేరు చేసే కేంద్రం, కంపోస్టింగ్ యూనిట్, పల్లె ప్రకృతి వనం మరియు నర్సరీలను సందర్శించి, సేంద్రీయ ఎరువు తయారీ ప్రక్రియను పరిశీలించారు. ఈ పర్యటనలో డీపీఓ, డీఎల్‌పీఓ, ఎంపీఓ, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా కార్య...

రైతులకు సక్రమంగా విద్యుత్ సరఫరా చేయలేని అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం – నష్టపోయిన రైతులను ఆర్థికంగా ఆదుకోవాలి అన్న *ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి**

Image
16.10.26: మెదక్ , నర్సాపూర్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోందని ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సక్రమంగా విద్యుత్ సరఫరా చేయలేని అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శించారు. నెలల తరబడి కష్టపడి పెట్టిన పెట్టుబడులు వృథా అవుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం భద్రాద్రి, యాదాద్రి వంటి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టిందని గుర్తుచేశారు.  ప్రస్తుతం కరెంట్ కోతలకు కారణాలేమిటో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేయాలని, విద్యుత్ ఉత్పత్తి, బొగ్గు సరఫరాపై ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యుత్ వ్యవస్థకు కీలకమైన సింగరేణి సంస్థలో బొగ్గు ఉత్పత్తి, నిల్వలు, సరఫరాపై పూర్తి వివరాలను వెల్లడించాలని కోరారు. సింగరేణిలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని, సంస్థ వాటాల విక్రయం లేదా ప్రైవేటీక...

బీవీ రాజు జయంతి పురస్కరించుకొని జరిపిన రక్త దాన శిబిరం విజయవంతం @ BVRIT

Image
  15.10.26: మెదక్, నర్సాపూర్: పద్మభూషణ్ డా. బి.వి. రాజు 106 వ జయంతిని పురస్కరించుకుని బి.వి. రాజు ఇన్‌టెక్ ఆఫ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఎన్‌టీఆర్ ట్రస్ట్ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సామాజిక సేవ, మానవతా విలువలను పెంపొందించడంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి సహాయం అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజ సేవకు విశేష కృషి చేసిన డా. బి.వి. రాజు ఆశయాలకు అనుగుణంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎన్‌టీఆర్ ట్రస్ట్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, సేవాభావం, మానవతా దృక్పథం మరింత పెంపొందించేందుకు కృషి చేశారు. ఇలాంటి కార్యక్రమాల్లో యువత భాగస్వాములు కావడం ద్వారా సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సంజయ్ దూబే, డైరెక్టర్ లక్ష్మీ ప్రసాద్, సమాచార సాంకేతిక విభాగాధిపతి దశరథ రామయ్య, అన్ని విభాగాల అధిపతులు, కార్యక్రమ సమన్వయకర్తలు, అధ్యాపకులు, జనరల్ మేనేజర్ బాపి రాజు, ఏజియన్ ఫైనాన్స్‌కు చెందిన కాంతారావు, అధ్యాపక సమన్వయకర్త కృష్ణ ప్రసన్న, విద్యార్థి సమన్వయకర్తలు ...

ఎక్సైజ్, STF సంయుక్త దాడులలో 372 గ్రాముల ఆల్ప్రాజోలం, 13.23 గ్రాముల MDMA స్వాధీనం

Image
15.10.26: మెదక్, నర్సాపూర్‌: మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ మరియు విక్రయాలను అరికట్టేందుకు డిప్యూటీ కమిషనర్, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ మరియు జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి, మెదక్ జిల్లా వారి ఆదేశాల మేరకు ఎక్సైజ్ STF మరియు స్థానిక ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించినట్లు ఎక్సైజ్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ గులాం ముస్తఫా తెలిపారు. ఈ దాడుల్లో 372 గ్రాముల ఆల్ప్రాజోలం, 13.23 గ్రాముల MDMA, ఒక ద్విచక్ర వాహనం మరియు రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా, మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని తెలిపారు. ఈ దాడుల్లో హైదరాబాద్ STF ఇన్‌స్పెక్టర్ S. రమేష్, నర్సాపూర్ ఎక్సైజ్ స్టేషన్ SHO మరియు సబ్-ఇన్‌స్పెక్టర్ D. శరత్ కుమార్, అండర్ ట్రైనింగ్ అధికారి జ్ఞానేశ్వర్ మరియు ఇతర ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కేసులో A1 ఆగమయ్యల మోహన్ గౌడ్, A2 కోటగిరి శ్రీకాంత్ గౌడ్‌లను అరెస్ట్ చేసి, NDPS చట్టం ప్రకారం తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు. మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. మాదకద్రవ్యాల మూలాలు, సరఫరాదారులు మరియు అక్రమ రవాణా నెట్‌వర్క్‌పై దర్యాప్తు కొనసాగుతోంది...

ఆత్మహత్య చేసుకున్న రైతు మాలోత్ శంకర్ కుటుంబాన్ని పరామర్శించిన మెదక్ పార్లమెంట్ సభ్యులు ఎం. రఘునందన్ రావు.

Image
 ఆత్మహత్య చేసుకున్న రైతు మాలోత్ శంకర్ కుటుంబాన్ని పరామర్శించిన మెదక్ పార్లమెంట్ సభ్యులు ఎం. రఘునందన్ రావు. 15.10.26: మెదక్, శివ్వంపేట: మండలంలోని భీమ్లా తాండ గ్రామపంచాయతీ పరిధిలోని శంకర్ తండాలో రైతు మాలోత్ శంకర్ తన వరి పొలం ఎండిపోయిందని బెంగపడి మనస్థాపంతో పొలంలో ఉన్న చెట్టుకు ఉరేసుకొని చనిపోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సరైన విద్యుత్ ను అందించలేక పోవడంతో తాను సాగు చేసిన వరి పంటకు తగిన నీరు సరిపోలేక వరి పంట ఎండిపోయిందని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మృతి చెందిన శంకర్ కుటుంబాన్ని మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయం చేసి, మాట్లాడుతూ.. శంకర్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని అందించాలని అన్నారు. కార్యక్రమంలో భారతీయ జనతాపార్టీ జిల్లా కార్యదర్శి అశోక్ సాదుల, మండల అధ్యక్షులు పెద్దపులి రవి, భీమ్లా తాండ సర్పంచ్ లక్ష్మీ దుర్గ్య నాయక్, ఉప సర్పంచ్ కంస వెంకటేష్ నాయక్, జిల్లా కార్యదర్శి ఎరుకల భిక్షపతి, జిల్లా కోశాధికారి ఆంజనేయులు గౌడ్, మండల ఉపాధ్యక్షులు గోప్యానాయక్, దుబ్బ శేఖర్...

నాయకుల, అధికారుల బాధ్యత రాహిత్యం తో అంబేద్కర్ విగ్రహం లేని జిల్లా కేంద్రంగా మారిన మెదక్

Image
నాయకుల, అధికారుల బాధ్యత రాహిత్యం తో అంబేద్కర్ విగ్రహం లేని జిల్లా కేంద్రంగా మారిన మెదక్ 15.10.26: జిల్లా కేంద్రం అయిన మెదక్ పట్టణంలో రోడు విస్తరణలోని భాగంలో తొలగించిన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహంను తిరిగి ప్రతిష్టించడంలో ప్రజా ప్రతినిధులు, స్థానిక శాసనసభ సభ్యులు , జిల్లా ఎస్ సి డి డి అధికారులు, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, చైర్మన్లు నిర్లక్ష్యం వహించకుండా వెంటనే అంబేద్కర్ విగ్రహంను ఆవిష్కరణ చేయాలని దళిత రత్న అవార్డు గ్రహీత,హోళియదాసరి హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ తరపున శాఖమూరి యాదగిరి హోలియదాసరి డిమాండ్ చేశారు. గతంలో జిల్లా కేంద్రంలో రెండు అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయని 1. రాందాస్ చౌరస్తా లో 2 . పోస్ట్ ఆఫీస్ దగ్గరలో ఉండగా ప్రస్తుతం ఒక్క విగ్రహం కూడా అధికారికంగా ఆవిష్కరణకు నోచుకోకపోవడం ఆవేదన బాధ కలిగి స్తోందని అన్నారు. అంబేద్కర్ వర్థంతి 06.12.2026 రోజున ఒక్క విగ్రహంను ఆవిష్కరణకు, మరొక విగ్రహంనకు పునః ప్రతిష్టించి ఆవిష్కరణకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహలు ఆవిష్కరించకపోతే 59 దళిత సంఘాలు, ప్రజా సంఘాలను కలుపుకోని తామే అంబేద్...

అప్పులు తీర్చే మార్గం తోచక రైతు తలారి ఆంజనేయులు ఆత్మహత్య

Image
అప్పులు తీర్చే మార్గం తోచక రైతు తలారి ఆంజనేయులు ఆత్మహత్య  13.10.26: మెదక్, నర్సాపూర్: ఆవంచ గ్రామానికి చెందిన తలారి ఆంజనేయులు, తండ్రి పేరు రమేష్, వయస్సు 36 సంవత్సరాలు, కులం ముదిరాజ్, వృత్తి వ్యవసాయం, గత 15 సంవత్సరాల క్రితం తలారి లావణ్య, వయస్సు 34 సంవత్సరాలు, కులం ముదిరాజ్,ను వివాహం చేసుకొని కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. కుమారుడు తలారి మనివర్ధన్, వయస్సు 13 సంవత్సరాలు, 7వ తరగతి చదువుతుండగా, కుమార్తె మధుచందన, వయస్సు 11 సంవత్సరాలు, 6వ తరగతి చదువుతోంది. గత కొన్ని రోజులుగా వ్యవసాయ అవసరాలు మరియు ట్రాక్టర్‌కు సంబంధించిన ఖర్చుల కోసం అప్పులు తీసుకొని వ్యవసాయం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆంజనేయులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయమై ఆయన తరచూ ఆందోళన వ్యక్తం చేసేవాడని, భార్య లావణ్య ధైర్యం చెబుతూ అప్పులు క్రమంగా తీర్చుకుందామని భరోసా ఇచ్చేదని తెలిపింది. ఈ క్రమంలో, తేదీ 12.10.2026 రాత్రి ఆర్థిక ఇబ్బందుల విషయమై ఆంజనేయులు బాధపడుతుండగా భార్య ఆయనకు సర్ది చెప్పింది. అనంతరం రాత్రి సుమారు 9:00 గంటలకు కుటుంబ సభ్యులందరూ భోజనం చేసి నిద్రించారు. త...

కూతురు, కొడుకుతో కలిసి ఇల్లు వదిలిన మహిళ, ఆచూకీ కోసం పోలీసులను ఆశ్రయించిన మహిళ తండ్రి, భర్త

Image
 కూతురు, కొడుకుతో కలిసి ఇల్లు వదిలిన మహిళ, ఆచూకీ కోసం పోలీసులను ఆశ్రయించిన మహిళ తండ్రి, భర్త 11.06.26: మెదక్, నర్సాపూర్: నర్సాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జక్కపల్లి గ్రామానికి చెందిన స్వల్కపల్లి లింగం గౌడ్, వయస్సు 56 సంవత్సరాలు, తన కుమార్తె లడిపిర్ల అనిత, వయస్సు 30 సంవత్సరాలు, మరియు ఆమె ఇద్దరు పిల్లలు శ్రీనివాస్, వయస్సు 10 సంవత్సరాలు, ఆదిక్య, వయస్సు 7 సంవత్సరాలు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారుని అల్లుడు అనిల్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం, 10.10.2026 తేదీన ఉదయం సుమారు 11:30 గంటల సమయంలో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ అనంతరం అనిత తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటి నుండి వెళ్లిపోయింది. అప్పటి నుండి వారి ఆచూకీ తెలియకపోవడంతో బంధువుల ఇళ్లలో మరియు పరిసర ప్రాంతాల్లో వెతికినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అనిత ఉపయోగించే మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్‌లో ఉంది. ఈ విషయమై 11.10.2026 తేదీన ఫిర్యాదు అందిన నేపథ్యంలో, నర్సాపూర్ పోలీసులు కేసు వివరాల ఆధారంగా తల్లి అనిత మరియు పిల్లలు శ్రీనివాస్, ఆదిక్య ఆచూకీ గుర్తించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ప్రజలకు విజ్ఞప్తి: పై మహిళ లేదా...

ప్రాజెక్ట్ స్థాయి పోషణ మాసం కార్యక్రమం లో పాల్గొని అంగన్వాడీ సేవలను అభినందించిన ఎమ్మెల్యే వాకిటి సునీతా రెడ్డి

Image
09.10.26: మెదక్, నర్సాపూర్: రైతు వేదిక లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సునీతా రెడ్డి హాజరై అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో అంగన్వాడీ టీచర్లు ఎంతో అద్భుతమైన సేవలు అందిస్తున్నారని తెలిపారు. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి శిశువు జన్మించిన అనంతరం కూడా తల్లి, బిడ్డల ఆరోగ్య పరిరక్షణకు అంగన్వాడీ టీచర్లు నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ రాజు యాదవ్ మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్లు పోషణ అనేక కార్యక్రమాల ద్వారా  ప్రతి ఒక్కరికి పోషణ గురించి వివరించడం జరుగుతుంది అని తెలిపారు. ఆరోగ్య పోషణ గురించి అంగన్వాడీ టీచర్ పాత్ర ఎంతో ఉంటుందని కొనియాడారు. కార్యక్రమంలో పాల్గొన్న డీడబ్ల్యూఓ హేమాభార్గవి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ బయట లభించే జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని, ఇంట్లోనే పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తయారు చేసి పిల్లలకు అందించాలని సూచించారు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలతో కూడిన సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ప...

బీవీఆర్‌ఐటీలో ఘనంగా ఎం.టెక్‌ ఫ్రెషర్స్‌ ఇండక్షన్‌ ప్రోగ్రామ్‌”

Image
  “బీవీఆర్‌ఐటీలో ఘనంగా ఎం.టెక్‌ ఫ్రెషర్స్‌ ఇండక్షన్‌ ప్రోగ్రామ్‌” 05.10.26: మెదక్, నర్సాపూర్‌: బీవీఆర్‌ఐటీ ప్రాంగణంలో ఎం.టెక్‌ ప్రథమ సంవత్సరం నూతన విద్యార్థుల ఇండక్షన్‌ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఛైర్మన్‌ శ్రీ కె. విష్ణు రాజు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పరిశ్రమలతో అనుసంధానమై నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవడంతో పాటు, బీవీఆర్‌ఐటీ పూర్వ విద్యార్థుల సహకారాన్ని సద్వినియోగం చేసుకొని కెరీర్‌లో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. బీవీఆర్‌ఐటీ పలు ప్రముఖ పరిశ్రమలు, ఈవీటీ టెక్నాలజీస్‌, ఇంజినీరింగ్‌ డిజైన్‌ సంస్థలతో అకడమిక్‌–ఇండస్ట్రీ భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోందని తెలిపారు. ఈ భాగస్వామ్యాల ద్వారా ఎం.టెక్‌ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌, ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలోని ప్రముఖ ఐఐటీలతో పరిశోధన, అకడమిక్‌ సహకారాన్ని అందిస్తున్నామని, క్యాంపస్‌లోని ఆధునిక పరిశోధనా ప్రయోగశాలలు, ఇతర సదుపాయాలను విద్యార్థులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. వైస్‌ ఛైర్మన్‌ శ్రీ రవిచ...

ఈ నెల 6 వ తేదీన మెదక్‌ జిల్లాలో గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా పర్యటన

Image
*ఈ నెల 6 వ తేదీన మెదక్‌ జిల్లాలో గవర్నర్‌ శ్రీ శివ ప్రతాప్‌ శుక్లా పర్యటన* 🔹 మధ్యాహ్నం 2.30 గంటలకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) కి చేరుకోనున్న గవర్నర్‌ 🔹 మధ్యాహ్నం 2.40 గంటలకు ఐడీఓసీ ఆవరణలో మాదక ద్రవ్యాలు కలిగే అనర్థాలపై ప్రజలను చైతన్యం చేస్తే ఉద్దేశ్యంతో చేపట్టే నషా ముక్త్‌ భారత్‌ ర్యాలీని ప్రారంభించనున్న గవర్నర్ శ్రీ శివ ప్రతాప్‌ శుక్లా 🔹 ఐడీఓసీలో విద్యార్థులతో  గవర్నర్  ముఖాముఖి కార్యక్రమం 🔹 మధ్యాహ్నం 2.50 గంటలకు ఐడీఓసీ లో  మహిళా శక్తి స్టాళ్లను సందర్శించి స్వయం సహాయక సంఘాల సభ్యులతో భేటీ కానున్న గవర్నర్‌ 🔹 నూతనంగా ఎన్నికైన రెడ్‌క్రాస్‌ సొసైటీ ప్రతినిధులతో సమావేశం 🔹 మధ్యాహ్నం 3 గంటలకు IDOC నుండి రామాయంపేటకు బయలుదేరనున్న గవర్నర్‌ 🔹మధ్యాహ్నం 3.30 గంటలకు  అమోఘ్‌ హోటల్‌ సమీపంలోని వివేకానంద విగ్రహం వద్దకు చేరుకోనున్న గవర్నర్ శ్రీ శివ ప్రతాప్‌ శుక్లా 🔹మధ్యాహ్నం 3.30 గంటలకు సుమారు 35 వేల జీడిమామిడి మొక్కలను నాటే కార్యక్రమంకు ముఖ్య అతిథిగా హాజరై   ప్రారంభించనున్న గవర్నర్‌ 🔹 మెదక్‌ ఎంపీ శ్రీ మాధవనేని రఘునందన్‌ రావు ఆధ్వర్యంలో మొక్కల నాటే కార్...

*ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ ఛాంపియన్ కార్యక్రమం* @ నర్సాపూర్, మెదక్

Image
 *ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ ఛాంపియన్ కార్యక్రమం* 03.10.26: మెదక్, నర్సాపూర్: నియోజకవర్గంలోని నర్సాపూర్, శివంపేట, చిలిపిచేడు, కౌడిపల్లి మండలాలకు చెందిన అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులు, ఐకేపీ సిబ్బందితో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ ఛాంపియన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో నర్సాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీ రాజు యాదవ్ పాల్గొని మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం వివిధ శాఖలలో పనిచేస్తున్న సిబ్బంది అందిస్తున్న సేవలను అభినందిస్తూ, గ్రామాల్లో ప్రజల ఆరోగ్యం, పోషణ, అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వారందరూ పోషణ ఛాంపియన్లని కొనియాడారు. ముఖ్యంగా “ఆరోగ్యమే మహాభాగ్యం” అని, ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. సీడీపీవో హేమా భార్గవి మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరి సహకారం ఎంతో అవసరమని తెలిపారు. గ్రామాల్లో పనిచేస్తున్న అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేసినప్పుడే ఆరోగ్యవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దగలమని పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలవుతున్న ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించడంతో పాటు, అంగన్‌వాడీ క...