అమ్మాయిలకు 18 సంవత్సరాల నిండిన తర్వాతనే పెళ్లిళ్లు చేయాలని, ఉన్నత చదువులు చదివించి వారి బంగారు భవిష్యత్తుకు పీటలు వేయాలని ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బేటి బచావో బేటి పడావో రక్షాబంధన్ కార్యక్రమం.
అమ్మాయిలకు 18 సంవత్సరాల నిండిన తర్వాతనే పెళ్లిళ్లు చేయాలని, ఉన్నత చదువులు చదివించి వారి బంగారు భవిష్యత్తుకు పీటలు వేయాలని ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బేటి బచావో బేటి పడావో రక్షాబంధన్ కార్యక్రమం.
31.08.26; మెదక్, నర్సాపూర్: ఎంపీడీవో ఆఫీస్ కార్యాలయంలో మండల స్తాయి అధికారుల అందరికి బేటి బచావో బేటి పడావో అనే కాన్సెప్ట్ పైన ICDS బాధ్యులు జడ్పీహెచ్ఎస్ స్కూల్ విద్యార్థులతో రాఖీలు కట్టించడం జరిగింది. తర్వాత ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో పి. రామకృష్ణ, మరియు ఇతర అధికారులకు విద్యార్థులతో రాఖీ కట్టించడం జరిగింది. అలాగే కోర్టు న్యాయమూర్తి, న్యాయవాదులకు, స్టాఫ్ కి రాఖీలు కట్టించి విద్యార్థులచే బేటి బచావో బేటి పడావో అనే నినాదం పైన ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మాయిలకు 18 సంవత్సరాల నిండిన తర్వాతనే పెళ్లిళ్లు చేయాలని, మరియు ఉన్నత చదువులు చదివించి వారి బంగారు భవిష్యత్తుకు పీటలు వేయాలని, అది మనందరి బాధ్యత అని తెలుపుతూ జరుపుకున్న ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు పాల్గొని విజయవంతం చేయడం జరిగినది.

Comments
Post a Comment