అక్రమంగా తరలిస్తున్న 300 గ్రాముల పాపీ స్ట్రా పౌడర్ స్వాధీనం @ తూప్రాన్ టోల్ ప్లాజా
23.08.26: Medak: జిల్లా అబ్కారీ అధికారి నరసింహారెడ్డి ఆదేశాల మేరకు, నర్సాపూర్ సీఐ గులాం ముస్తఫా ఆధ్వర్యంలో తూప్రాన్ టోల్‌ప్లాజా వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న 300 గ్రాముల పాపీ స్ట్రా పౌడర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ case సంబంధించి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కొలేశ్వర్‌ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ తనిఖీల్లో ఎస్‌ఐ రాఘవేంద్రరావు, ఎస్‌ఐ ఖాజా అజీజ్ అహ్మద్, అబ్కారీ station narsapur సిబ్బంది రవీ, హెడ్ కానిస్టేబుల్ రాశేకర్, కానిస్టేబుళ్లు షాహిద్, సందీప్,
మెదక్ డీటీఎఫ్ సిబ్బంది బాలయ్య si మరియు ఇతర డీటీఎఫ్ సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు.
అక్రమ మాదక పదార్థాల రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని అబ్కారీ అధికారులు gulammustafa ci తెలిపారు. స్వాధీనం చేసుకున్న పాపీ స్ట్రా పౌడర్‌కు సంబంధించి కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Comments
Post a Comment