అవసరాలకు తగినంత ఎరువులు అందుబాటులో ఉన్నాయి. రైతులు ఎవరు ఆందోళన పడవద్దు అన్న Agri AD
అవసరాలకు తగినంత ఎరువులు అందుబాటులో ఉన్నాయి. రైతులు ఎవరు ఆందోళన పడవద్దు అన్న Agri AD
23.08.26: మెదక్, నర్సాపూర్: 7వ తేదీ ఆగస్టు 2026 రోజు నుంచి మనకు ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ ఎరువుల బుకింగ్ యాప్ ను ప్రారంభించడం జరిగిందనీ,
ఈ యాప్ ద్వారానే అన్ని ఎరువులను కొనుగోలు చేయాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ AD సంధ్య రాణి తెలిపారు. కొత్తగా వచ్చిన ఈ యాప్ ప్రారంభ దశలో ఉన్నందువల్ల కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి అని, యాప్ లో వస్తున్న ఆయా సమస్యలను గుర్తిస్తూ..పరిష్కరిస్తూ వస్తున్నామని,
మొదట "జిల్లావ్యాప్తంగా" ఎక్కడైనా కొనుగోలు చేసే ఆప్షన్ నుండు గత "రెండు రోజుల నుంచి డివిజన్ వారీగా" ఎరువులు ఇవ్వడానికి ఆప్ ను అప్డేట్ చేయడం జరిగిందని తెలుపుతూ..ముందు ముందు ఏ ఏ మండలాల రైతులు ఆయా మండలంలోనే ఎరువులు పొందే విధంగా అప్డేట్ చేస్తున్నామని తెలిపారు. ఇక రైతులు అవసరాలకు మించి ఎక్కువగా ఎరువులను కొనుగోలు చేయడం వలన కొంతమంది రైతులు ఎరువులు కొనుగోలులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని, నర్సాపూర్ డివిజన్ పరిధిలో గత సంవత్సరం *2780* మెట్రిక్ టన్నుల యూరియాను అంద చేస్తే..
ఈ సంవత్సరం ఆగస్టు వరకు *3291* మెట్రిక్ టన్నుల యూరియాని అందజేయడం జరిగింది అన్నారు.
ఎలాంటి యూరియా కొరత లేనందువల్ల రైతులు అవసరం ఉన్న వారు, అవసరం ఉన్న మేర మాత్రమే యూరియాను కొనుగోలు చేయాలి అన్నారు. కొంతమంది రైతులు రబీ సీజన్ కూడా ఇప్పుడే కొనుగోలు చేసుకుని పెట్టుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి అని, దయచేసి రైతులు సంయమనం పాటించి అవసరాల మేరకే యూరియాని కొనుగోలు చేయాలని ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. అన్నారు. ఇప్పుడు మండల్ ఒక యూనిట్ గా యాప్ లో స్థిరీకరించారు కాబట్టి ఎవరి మండలాల రైతులు వారి మండలాలనే తీసుకునే అవకాశం ఉంటుంది అని, సాంకేతిక సమస్యలు కూడా చాలావరకు పరిష్కారం అయ్యాయి కాబట్టి రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.

Comments
Post a Comment