బాధితులకు అండగా ఉన్న భరోసా కేంద్రం మరింత సమర్థవంతంగా సేవలందించాలి: అదనపు ఎస్పీ వి. విక్రాంత్ కుమార్ సింగ్ ఐపీఎస్


07.08.26: మెదక్:  మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల్లో బాధితులకు అండగా నిలుస్తూ.. వారికి అవసరమైన సహాయాన్ని ఒకే వేదికపై అందిస్తున్న భరోసా కేంద్రం నాలుగో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. గత నాలుగు సంవత్సరాలుగా భరోసా కేంద్రం మహిళలు, చిన్నారులపై జరిగిన నేరాల బాధితులకు అండగా నిలుస్తూ, వారికి అవసరమైన కౌన్సెలింగ్, న్యాయ సహాయం, వైద్య సహాయం, పునరావాస సేవలను సమన్వయంతో అందిస్తోందన్నారు. బాధితులు నేరం జరిగిన తర్వాత ఎదుర్కొనే మానసిక ఒత్తిడి, భయాందోళనలను అధిగమించేలా వారికి ధైర్యం కల్పించడంతో పాటు, న్యాయం పొందే వరకు అవసరమైన సహకారం అందించడం భరోసా కేంద్రం ప్రధాన లక్ష్యమన్నారు. బాధితుల గోప్యత, గౌరవానికి ప్రాధాన్యతనిస్తూ సున్నితమైన విధానంతో వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. బాధితులకు సత్వర సహాయం అందేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేయాలని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే సేవా దృక్పథంతో మరింత సమర్థవంతంగా పనిచేస్తూ.. బాధితులకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించాలని అదనపు ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో ఎసై సుచరిత, భరోసా కోఆర్డినేటర్ సౌమ్య, భరోసా కేంద్రం సిబ్బంది, సిబ్బంది పాల్గొన్నారు..

Comments

Popular posts from this blog

న్యూ అమ్మ హాస్పటల్ సీజ్ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్

కూరగాయలు అమ్ముకొని ఇంటికి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి – నలుగురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ మహిళా ఉద్యోగి మృతి, అందిన పిర్యాదు మేరకు ప్రమాద కారణాలు అన్వేషిస్తున్న పోలీసులు