గ్రంథాలయం అభివృద్ధి చెందితే జ్ఞాన సమాజం అభివృద్ధి చెందుతుంది అన్న ప్రిన్సిపాల్ సంజయ్ దూబే
పత్రిక ప్రకటన, తేది:12/08/2026.
బి.వి.రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఘనంగా 134వ జాతీయ గ్రంథాలయ దినోత్సవం
· ఆధునిక సాంకేతిక వనరులతో బీవీఆర్‌ఐటీ గ్రంథాలయ సేవలు
· ఆగస్టు 12న గ్రంథాలయ శాస్త్ర పితామహుడు డా. ఎస్. ఆర్. రంగనాథన్ జయంతి
· ఘనంగా 134వ జాతీయ గ్రంథాలయ దినోత్సవం
· గ్రంథాలయం అభివృద్ధి చెందితే జ్ఞాన సమాజం అభివృద్ధి చెందుతుంది
· విద్యార్థులలో పఠనాసక్తి ఉత్తేజపరిచిన వక్తలు.
· పుస్తకం ఒక మంచి మిత్రుడు
· గ్రంథాలయం జ్ఞానానికి ద్వారం
· గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, వక్తల పిలుపు
నర్సాపూర్, ఆగస్టు 12: విద్యార్థుల విజ్ఞాన సముపార్జన, అకడమిక్ అభివృద్ధిలో గ్రంథాలయం కీలక పాత్ర పోషిస్తుందని బీవీఆర్‌ఐటీ ప్రిన్సిపాల్ డా. సంజయ్ దూబే అన్నారు. బుధవారం బి.వి.రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీవీఆర్‌ఐటీ) సరస్వతి బ్లాక్‌లోని సెంట్రల్ లైబ్రరీలో గ్రంథాలయ శాస్త్ర పితామహుడు డా. ఎస్.ఆర్. రంగనాథన్ జయంతిని పురస్కరించుకుని 134వ జాతీయ గ్రంథాలయ దినోత్సవాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా డా. సంజయ్ దూబే మాట్లాడుతూ గ్రంథాలయంలోని పుస్తకాలు, ఈ-వనరులు, ఇతర సమాచార వనరులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కళాశాల డైరెక్టర్ డా. కె. లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థుల విజయానికి గ్రంథాలయం ముఖ్యమైన ఆధారమని అన్నారు. పాఠ్యపుస్తకాలతో పాటు విజ్ఞాన, సాహిత్య పుస్తకాలను చదవడం ద్వారా జ్ఞానం, ఆలోచనా విధానం, వ్యక్తిత్వ వికాసం పెంపొందుతాయని తెలిపారు. కందుకూరి వీరేశలింగం గారి ప్రసిద్ధ సూక్తి, బాహ్య సౌందర్యం కంటే జ్ఞానార్జనకు ప్రాధాన్యత ఇవ్వాలని, పుస్తక పఠనం వ్యక్తి వికాసానికి ఎంత అవసరమో చెబుతుంది. చిరిగిన చొక్కా వేసుకున్నా పర్వాలేదు, కానీ మంచి పుస్తకం కొనాలనే ఈ సందేశం జ్ఞానాభివృద్ధి కి, ఉన్నతమైన ఆలోచనలకు ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు.
డీన్–ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ డా. బంగారు రాజు మాట్లాడుతూ మంచి పఠన అలవాట్లు, సమయపాలన, నిరంతర అభ్యాసం విద్యార్థుల విజయానికి దోహదపడతాయని అన్నారు. విద్యార్థులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడం తో పాటు అకడమిక్ మరియు ప్లేస్మెంట్ శిక్షణకు ముందుగానే సిద్ధం కావాలని సూచించారు.. ఈసీఈ విభాగాధిపతి డా. సంజీవ రెడ్డి, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డా. పి. విష్ణు మాట్లాడుతూ విద్యార్థులు రోజువారీ జీవితంలో పఠనాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలని సూచించారు.
లైబ్రేరియన్ డా. ఎ. మల్లికార్జున మాట్లాడుతూ బీవీఆర్‌ఐటీ సెంట్రల్ లైబ్రరీలో అధునాతన పుస్తకాలు, అంతర్జాతీయ జర్నల్స్, ఈ-బుక్స్, పరిశోధనా ప్రచురణలు, GATE, సివిల్స్, ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ పుస్తకాలు, డిజిటల్ లైబ్రరీ, కిండిల్ ఈ-బుక్స్, ప్రింట్ జర్నల్స్, మ్యాగజైన్లు తదితర వనరులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం గ్రంథాలయ సేవలను ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో కళాశాల డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. లైబ్రరీ సిబ్బంది శ్రీమతి శ్రీ వాణి, శ్రీ రవి నాయక్, శ్రీ ఎస్. రాజు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ శ్రీ బి. బాపిరాజు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీ టి.ఎల్.ఎన్. సురేష్ తదితరులు పాల్గొన్నారు.“మంచి పుస్తకం మంచి స్నేహితుడు – నిరంతర పఠనం విజయానికి బాట” అనే సందేశాన్ని ఈ సందర్భంగా అందించారు.
ప్రిన్సిపాల్ డా. సంజయ్ దూబే




Comments
Post a Comment