17.11.26: మెదక్, నర్సాపూర్: నిన్న (16.11.26) రాత్రి సుమారు 08:10 గంటల సమయంలో NH-765D జాతీయ రహదారిపై నర్సాపూర్ - గుమ్మడిదల్ల అటవీ ప్రాంత పరిధిలోని కాసిల ఫార్మ్స్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, దౌల్తాబాద్ కూరగాయల మార్కెట్ లో వ్యాపారం ముగించుకున్న ఐదుగురు వ్యక్తులు ఒక ఆటోలో తమ స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా, హైదరాబాద్ వైపు వెళ్లే రహదారిపై ఎటువంటి హెచ్చరిక సూచికలు, ఇండికేటర్లు లేకుండా రోడ్డు పక్కన నిలిపి ఉంచిన టిప్పర్ లారీని ఆటో వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. మృతురాలి వివరాలు: రాజిపేట రాములమ్మ, భర్త శంకరయ్య, వయస్సు 55 సంవత్సరాలు, వృత్తి: కూరగాయల వ్యాపారం. గాయపడిన వారి వివరాలు: 1. రాజిపేట శంకరయ్య, వయస్సు 60 సంవత్సరాలు – తలకు మరియు శరీరంలోని కుడి వైపున తీవ్ర గాయాలయ్యాయి. 2. గండ్ల జీతయ్య, వయస్సు 57 సంవత్సరాలు – ఎడమ భుజంపై మరియు శరీరంపై గాయాలయ్యాయి. 3. వాలమల శోభారాణి, వయస్సు 48 సంవత్సరాలు – తలకు మరియు ముఖంపై గాయాలయ్యాయి. 4. జలిగామ బాలమణి, వయస్సు 52 సంవత్సరాలు – తలక...
Comments
Post a Comment