మెదక్ జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో మనోహరాబాద్ మండలంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీమతి చిలుముల సుహాసిని రెడ్డి గారు పాల్గొన్నారు.
మెదక్ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు – స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
మెదక్ జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో మనోహరాబాద్ మండలంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీమతి చిలుముల సుహాసిని రెడ్డి గారు పాల్గొన్నారు.
అదేవిధంగా మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుల స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కూడా ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ శాసనసభ్యులు శ్రీ మైనంపల్లి రోహిత్ గారు, మెదక్ జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రతిమ సింగ్ గారు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిలుముల సుహాసిని రెడ్డి గారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోందని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
“పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. నా ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల పక్షాన నిలుస్తుంది. ప్రజల అవసరాలను గుర్తించి వారికి అండగా నిలవడమే ప్రభుత్వ ధ్యేయం” అని ఆమె పేర్కొన్నారు.
ప్రజలకు మెరుగైన సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని ఆమె అన్నారు.






Comments
Post a Comment