*వరి సాగు నుంచి ప్రత్యామ్నాయ పంటల సాగు – పంటల వైవిధ్యీకరణ* పై *సహచర అభ్యాసం శిక్షణ కార్యక్రమం*

20.08.26: మెదక్, నర్సాపూర్: మండలంలో లింగాపూర్ రైతు వేదికలో *వరి సాగు నుంచి ప్రత్యామ్నాయ పంటల సాగు – పంటల వైవిధ్యీకరణ*  పై *సహచర అభ్యాసం శిక్షణ కార్యక్రమం*


వ్యవసాయ శాఖ  ఆధ్వర్యంలో ఆత్మ వారి సౌజన్యంతో రైతులకు శిక్షణ అందించడం జరిగింది. 

* టీ ఆర్ వి కె శాస్త్రవేత్త-డా . సతీష్ గారు మాట్లాడుతూ వరి సాగులో అధిక నీటి వినియోగం, సాగు ఖర్చులు, నేల ఆరోగ్యంపై ప్రభావం తదితర అంశాలను వివరించారు.

* నీటి లభ్యత, నేల స్వభావం, వాతావరణ పరిస్థితులు మరియు మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా కందులు, పెసలు, మినుములు, శనగ, మొక్కజొన్న, నువ్వులు, వేరుశనగ తదితర ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం ద్వారా పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహించవచ్చని సూచించారు.

* పంటల మార్పిడి ద్వారా నేల సారాన్ని కాపాడుకోవడంతో పాటు నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని, సాగు ఖర్చులను తగ్గించి రైతుల ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు ఉన్నాయని  వివరించారు.

* మండల వ్యవసాయ అధికారిణి దీపిక మాట్లాడుతూ రైతులు తమ భూమి స్వభావం, నీటి లభ్యత మరియు మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వరి సాగుతో పాటు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సూచించారు. శిక్షణలో భాగంగా రైతుల అవగాహన స్థాయిని తెలుసుకునేందుకు ప్రీ-ఎవాల్యుయేషన్, శిక్షణ అనంతరం అవగాహన పెరుగుదలను అంచనా వేసేందుకు పోస్ట్-ఎవాల్యుయేషన్ నిర్వహించారు.

* “నీటి పొదుపు – నేల ఆరోగ్యం – పంటల వైవిధ్యీకరణ – రైతు ఆదాయం పెంపు” లక్ష్యంగా ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు.

* కార్యక్రమంలో నర్సాపూర్ వ్యవసాయ విస్తరణ అధికారులు దుర్గా ప్రసాద్, తేజస్విని,రాజశేఖర్, లావణ్య మరియు రైతులు  పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

న్యూ అమ్మ హాస్పటల్ సీజ్ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్

కూరగాయలు అమ్ముకొని ఇంటికి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి – నలుగురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ మహిళా ఉద్యోగి మృతి, అందిన పిర్యాదు మేరకు ప్రమాద కారణాలు అన్వేషిస్తున్న పోలీసులు