ఉద్యమకారులు కానుకుంట రామకృష్ణ గౌడ్ జన్మదిన సందర్భంగా శాలువాతో గౌరవించుకొని శుభాకాంక్షలు తెలిపిన తోటి ఉద్యమకారులు

21.08.26: సంగారెడ్డి, గుమ్మడిదల:


మున్సిపాలిటీ పరిధిలోని దోమడుగు గ్రామంలో తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కానుకుంట రామకృష్ణ గౌడ్ జన్మదినం సందర్భంగా, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక సంబంధించిన నాయకులు, ఉద్యమకారులు అందరూ కలిసి దోమడుగులోని వారి ఇంటికి వెళ్లి వారిని శాలువాతో సత్కరించి జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామకృష్ణ గౌడ్ గారు తెలంగాణ ఉద్యమంలో పోలీసులకు కేసులకు ఎవ్వరికీ భయపడకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతగానో కృషి చేశారని వారు గుర్తు చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వారి జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం మాకు అందరికీ సంతోషంగా ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుమ్మడిదల తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక కన్వీనర్ మంద భాస్కర్ రెడ్డి, కో కన్వీనర్ మల్లేష్ గౌడ్, దర్గా శ్రీనివాస్, మద్ది సుదర్శన్ రెడ్డి గార్లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

న్యూ అమ్మ హాస్పటల్ సీజ్ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్

కూరగాయలు అమ్ముకొని ఇంటికి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి – నలుగురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ మహిళా ఉద్యోగి మృతి, అందిన పిర్యాదు మేరకు ప్రమాద కారణాలు అన్వేషిస్తున్న పోలీసులు