తెలంగాణ ఉద్యమకారులను మరిచిన ప్రభుత్వం ఇకనైనా మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయాలని మహాధర్న
తెలంగాణ ఉద్యమకారులను మరిచిన ప్రభుత్వం ఇకనైనా మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయాలని మహాధర్న
25.08.26: సిద్దిపేట: జిల్లాలోని మండల కేంద్రమైన మిరుదొడ్డిలో టీయూజేఏసీ ఆధ్వర్యంలో మహాధర్న నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారులు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడుతూ.. కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ.. ఇంతవరకు సరైన ఉద్యమకారులను గుర్తించక కేవలం పార్టీలకు పరిమితమైన కేకే కమిటీ ఇప్పటికైనా గుర్తించాలని, ఈ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మిడిదొడ్డిలో మహా ధర్నా చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా టీజేసి నాయకులు సూకూరి లింగం, శ్రీనివాస్, రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రెటరీ కోల విజయకుమార్, రాష్ట్ర సెక్రటరీ నందిని మాస్టర్ కొమ్ము శంకర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారుల కోసం మేనిఫెస్టో లో ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలోని ఉద్యమకారులు అందరికీ ప్రభుత్వం ఇస్తానన్న హామీలు కచ్చితంగా ఇవ్వాలని 250 గజాల ఇళ్ళ స్థలం, 25 వేల పెన్షన్ ఇవ్వాలన్నారు. KK కమిటీ కాలయాపన కాకుండా నిజమైన ఉద్యమకారులను త్వరగా గుర్తించాలని ఈ సందర్భంగా తెలిపారు. లేని పక్షంలో సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. నిరసన కార్యక్రమాలు చేపడుతామని సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు పూడూరి శ్రీనివాస్, వడ్ల శ్రీనివాస్, మల్లేశం, రమేష్ గౌడ్, వల్లాల సత్యనారాయణ, దార మల్లయ్య, ధార స్వామి, బలిజ రమేష్, కొమ్ము శంకర్, వడ్డే రవి, బిక్షపతి, స్వామి తదితరులు పాల్గొన్నారు. అనంతరం తాసిల్దార్ కు, మండల పరిషత్ అధికారికి మెమొరాండం ఇవ్వడం జరిగింది.





Comments
Post a Comment