విష్ణు ఉన్నత పాఠశాలలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు

విష్ణు ఉన్నత పాఠశాలలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు 




29.08.26: మెదక్, నర్సాపూర్: 

ప్రముఖ భారత హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జన్మదినాన్ని క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో విష్ణు ఉన్నత పాఠశాలలో గత వారం రోజులుగా అనేక క్రీడా పోటీలను నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే అనేక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది. క్రీడల ప్రాముఖ్యతను గురించి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి. నాగజ్యోతి ప్రసంగించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయుల చేతుల మీదుగా బహుమతులు అందించడం జరిగింది. కార్యక్రమాన్ని వ్యాయామ ఉపాధ్యాయులు వెంకటేష్, రమేష్ గార్లు మరియు ఇతర ఉపాధ్యాయుల సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేశారు.

Comments

Popular posts from this blog

న్యూ అమ్మ హాస్పటల్ సీజ్ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్

కూరగాయలు అమ్ముకొని ఇంటికి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి – నలుగురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ మహిళా ఉద్యోగి మృతి, అందిన పిర్యాదు మేరకు ప్రమాద కారణాలు అన్వేషిస్తున్న పోలీసులు