ఓటరు జాబితా యందు తప్పులు సవరించుకొనుటకుగాను జరుపుకోనున్న హియరింగ్ ను ఓటర్ లు సద్వినియోగం చేసుకోవాలి.
ఓటరు జాబితా యందు తప్పులు సవరించుకొనుటకుగాను జరుపుకోనున్న హియరింగ్ ను ఓటర్ లు సద్వినియోగం చేసుకోవాలి.
31.08.26: మెదక్, నర్సాపూర్: పురపాలక సంఘం పరిధిలో ఎస్.ఐ.ఆర్ ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితా యందు తప్పులు సవరించుకొనుటకుగాను పోలింగ్ స్టేషన్ల వారిగా హియరింగ్ నిర్వహించడం జరుగుతుంది అని కమీషనర్ మరియు AERO అయిన సాయి కుమార్ తెలిపారు.
ఇందులో భాగంగా పట్టణంలోని 09,10 వార్డుల యందు హియరింగ్ నిర్వహించి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. కార్యక్రమంలో గ్రామ పాలన అధికారి ఆంజనేయులు, బిఎల్వోలు, పట్టణ ప్రముఖులు మరియు సదరు వార్డుల ప్రజలు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పట్టణ ఓటర్లు మున్సిపల్ కార్యాలయం నందు అందుబాటులో గల డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను పరిశీలించి తప్పులు ఉంటే.. సవరించుకొనుటకు వార్డు సభల యందు దరఖాస్తులు సమర్పించాలని కోరారు.




Comments
Post a Comment