నాల్గవ తరగతి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. పదోన్నతులు, బదిలీలు, సర్వీస్ అంశాలపై పెరుగుతున్న అసంతృప్తి సంఘాల ఐక్యతతోనే సాధించాలి అన్న జిల్లా కార్యవర్గ అధ్యక్ష కార్యదర్శులు
11.10.26: సంగారెడ్డి; ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న నాల్గవ తరగతి ఉద్యోగుల సమస్యలుసంవత్సరాలుగా పేరుకుపోతుండటంపై ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పదోన్నతులు, బదిలీలు, సర్వీస్‌కు సంబంధించిన పెండింగ్ అంశాలను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.సంగారెడ్డి జిల్లా తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం జిల్లా సంఘ భవన్‌లో జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షరీఫ్, కార్యదర్శి జె. నాగరాజు ఆధ్వర్యంలోనిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు దాస్య నాయక్, రాష్ట్ర కార్యదర్శి ఖాదర్ బిన్ హసన్, అసోసియేషన్ అధ్యక్షులు రాజేందర్, కోశాధికారి ధనరాజ్ ముఖ్య అతిథులుగాహాజరయ్యారు. టీఎన్‌జీఓఎస్ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ జావిద్ అలీ, కార్యదర్శి వేల్పూరు రవి కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా జావిద్ అలీ మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యాలయాల పనితీరు సజావుగా సాగడంలో నాల్గవ తరగతి ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమైనదైనా,

Comments
Post a Comment