చెట్టు కేవలం మొక్క కాదు. మన జీవనానికి ఊపిరి, చెట్లను కాపాడటం అంటే.. సమాజ భవిష్యత్తును కాపాడటమే.. అంటూ.. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వృక్ష రక్షా బంధన్

చెట్టు కేవలం మొక్క కాదు. మన జీవనానికి ఊపిరి, చెట్లను కాపాడటం అంటే.. సమాజ భవిష్యత్తును కాపాడటమే.. అంటూ.. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వృక్ష రక్షా బంధన్

31.08.26: మెదక్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వృక్ష రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, వృక్ష సంపద ప్రాధాన్యతపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు కళాశాల ప్రాంగణంలోని చెట్లకు రాఖీలు కట్టి, వాటిని సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. చెట్లు మనకు ప్రాణవాయువు, ఆహారం, నీడతో పాటు పర్యావరణ సమతుల్యతను అందిస్తున్నాయని అధ్యాపకులు వివరించారు.

*చెట్టు కేవలం మొక్క కాదు. మన జీవనానికి ఊపిరి*

చెట్లను కాపాడటం అంటే.. సమాజ భవిష్యత్తును కాపాడటమే.”

విద్యార్థు





లు ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించాలని ఈ కార్యక్రమం ద్వారా సంకల్పించారు. కళాశాల వృక్ష శాస్త్రం విభాగం,ఎకో క్లబ్, ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వృక్షశాస్త్ర విభాగాధిపతి అసోసియేట్ ప్రొఫెసర్ నాగేందర్రావు, ఐ క్యు ఏసి  కో -ఆర్డినేటర్ డాక్టర్ తిరుమల్ రెడ్డి, డాక్టర్ శ్రీలత,మురళి, డా.రాజు, వినోద్, మిగతా అధ్యాపకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

న్యూ అమ్మ హాస్పటల్ సీజ్ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్

కూరగాయలు అమ్ముకొని ఇంటికి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి – నలుగురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ మహిళా ఉద్యోగి మృతి, అందిన పిర్యాదు మేరకు ప్రమాద కారణాలు అన్వేషిస్తున్న పోలీసులు