మోహన్ భగవత్ నీ కపట నీతి జెన్ జీలు పసిగట్టారు. నష్ట నివారణ కోసమే జెన్ జీలతో ఆర్ఎస్ఎస్ భేటీ అన్న ET నర్సింహ

 తేదీ.8.8.2026

హైదరాబాద్.



మోహన్ భగవత్ నీ కపట నీతి జెన్ జీలు పసిగట్టారు.


నష్ట నివారణ కోసం జెన్ జీలతో ఆర్ఎస్ఎస్ భేటీ.






ఆర్ఎస్ఎస్ వ్యక్తులతోనే సంస్థల విధ్వంసం జరుగుతుంది. 


ఈటీ నరసింహ 

సిపిఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి.


🔷భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా నాగోల్ డివిజన్ సుజాత హోటల్ నుండి కేంద్ర బిజెపి ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ "బద్లావ్ జరూరి హై" నినాదం తో ముద్రించిన కరపత్రాలు పంచుతూ పాదయాత్ర ప్రారంభం అయింది.


🔷నాగోల్ చౌరస్తా, అల్కాపురి కాలనీ , సాయి నగర్ ఏరియాలో విస్తృతంగా  పర్యటన జరిగింది. ఎర్రజెండాలు చేత పట్టుకుని ప్రజానాట్యమండలి కళాకారుల డప్పుల చప్పులతో పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగింది.


🔷ఈ సందర్భంగా  ఈ.టీ నరసింహ మాట్లాడుతూ  విద్యావ్యవస్థను గాడిన పెట్టలేని కేంద్ర బిజెపి సర్కార్ యువత నుండి వస్తున్న వ్యతిరేకతను తగ్గించుకోవడంలో భాగంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ రంగంలోకి దించింది. 


🔷ఢిల్లీ జంతర్ మంతర్ లో ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో యువతరంపై అబద్దాలను ప్రచారం చేస్తూ విదేశీ ఫండ్స్ తోని ఈ దేశంలో పాలకవర్గాలను కూల్చే కుట్రలు చేస్తున్నారని రకరకాల వదంతులు వ్యాప్తి చేస్తూ దేశద్రోహులని ముద్ర వేసి అనేక రకాలుగా తప్పుడు ప్రచారాలు చేసినారు. 


🔷ఇవాళ ఏ ముఖం పెట్టుకొని జెన్ జీలు దేశం కోసం పనిచేస్తున్నారనీ, వాళ్ళు అడిగే ప్రశ్నలకు మనం సమాధానాలు చెప్పాలనీ బిజెపికి హితబోధ చేస్తున్న ఆర్ఎస్ఎస్ కపట నీతి ఈతరం యువతరం కి అర్థమైంది. 


🔷దేశంలోని విద్యారంగం నుండి మొదలుకొని అనేక రాజ్యాంగబద్ధ సంస్థలకు అధిపతులుగా ఆర్ఎస్ఎస్ సంబంధించిన వారిని నియమించిన తర్వాతనే వ్యవస్థలు పతనావస్థకు చేరుకున్నాయి. ఇది వాస్తవం. 12 ఏళ్ల కాలంలో ఏనాడు బిజెపి చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పైన ఒక్క మాట కూడా మాట్లాడని ఆర్ఎస్ఎస్ ఇవాళ బయటకు వచ్చి  పచ్చి మోసం, దగా చేయడానికి  విద్యారంగానికి ఆరు శాతం నిధులు కేటాయించాలని ప్రగల్బాలు పలుకుతున్నది.ఈ విషయాన్ని ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. 


🔷బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన యువతరంపై ఇంకా వివిధ రాష్ట్రాలలో కేసులు పెడుతూ బెదిరిస్తూ ఇబ్బందులు గురిచేస్తున్న సంఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి.


🔷కనీస వేతనాలు అందుకోలేని కార్మిక వర్గం శ్రమదోపిడికి గురవుతున్నది .మరోపక్క ఆర్టిఫిషియల్ ఇంటలిజన్సీ వచ్చిన తర్వాత లక్షలాదిమంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోతున్న ఈ తరుణంలో మరింత నిరుద్యోగాన్ని పెంచే విధంగా బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా విధానాలు చేస్తున్నది. కొత్త ప్రభుత్వ పరిశ్రమల ఊసులేదు ఉన్న ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారు.


🔷ప్రజాస్వామ్యం, రాజ్యాంగ ,పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడుకునే క్రమంలో సిపిఐ పార్టీ సెప్టెంబర్ 1వ తారీఖున లక్షలాది మందితో రామ్ లీలా మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు కదలి రావాలని తెలిపారు.


ఈ కార్యక్రమంలో సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి స్టాలిన్, జిల్లా కార్యవర్గ సభ్యులు కాంపల్లి శ్రీనివాస్, ఏరియా నాయకులు షాహిదా బేగం కొమ్ము యాదయ్య మహేందర్ ,కె .రాములు శ్రీనివాస్, సేవ్యా, లక్ష్మి ,హేమలత,అండాలు, రాజగౌడ్, తో పాటు వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. 


విప్లవాభి వందనాలతో 

కాంపల్లి శ్రీనివాస్ 

హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు. 

9573725352.

Comments

Popular posts from this blog

న్యూ అమ్మ హాస్పటల్ సీజ్ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్

కూరగాయలు అమ్ముకొని ఇంటికి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి – నలుగురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ మహిళా ఉద్యోగి మృతి, అందిన పిర్యాదు మేరకు ప్రమాద కారణాలు అన్వేషిస్తున్న పోలీసులు