పాఠశాలలను సందర్శించిన (OSAT) వన్ స్కూల్ ఎట్ టైం బృందం
07/08/2026: సంగారెడ్డి, హత్నూర: సిరిపుర,ఇస్మాల్కంపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు గదులు నిర్మించి, ప్రస్తుతం దౌల్తాబాద్ లో జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో నిర్మిస్తున్న సంస్త ప్రతినిధులు ఈరోజు సిరిపుర ఉన్నత పాఠశాలను మేడ్వాన్ డైరెక్టర్ హెచ్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నరసింహారావు మరియు శ్రీనివాస రెడ్డి గారి బృందం పాఠశాలను సందర్శించి అవసరమైన మౌలిక వస్తువులను సమకూర్చడానికి ప్రతిపాదనలను పంపించడానికి ఈ మూడు పాఠశాలలను సందర్శించి పాఠశాలలకు అవసరమైన వసతులను సమకూర్చడానికి పాఠశాలలను సందర్శించడం జరిగింది. భవన నిర్మాణం జరిగి రెండు సంవత్సరాలు కాగా పెయింట్ వేయించడం జరిగింది. కార్యక్రమంలో సిరిపురం ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి మంజుల, ఇస్మాయిల్ ఖాన్ పేట్ ప్రధానోపాధ్యాయులు సత్తుగొండ, దౌల్తాబాద్ ప్రధాన ఉపాధ్యాయులు కందప్ప, సిరిపురం మాజీ సర్పంచ్ మచ్చ నరేందర్ ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది



Comments
Post a Comment