జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన డిగ్రీ కళాశాల విద్యార్థిని అంజలి. విద్యార్థినికి వ్యాపారి రూ.10 వేల చేయూత.
జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన డిగ్రీ కళాశాల విద్యార్థిని అంజలి. విద్యార్థినికి వ్యాపారి రూ.10 వేల చేయూత.
07.09.26: మెదక్ : తల్లిదండ్రుల అండ లేకున్నా చదువుతో పాటు అథ్లెటిక్స్‌లో రాణిస్తూ జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు మెదక్ ప్రభుత్వ డిగ్రీ విద్యార్థిని అంజలి ఎంపికైంది.పోటీలకు వెళ్ళడానికి ప్రయాణఖర్చులు, ఇతర ఖర్చుల నిమిత్తం మెదక్ పట్టణానికి చెందిన వ్యాపారి గంజి శ్రీనివాస్ రూ.10 వేల ఆర్థిక సహాయం అందించారు.పాండిచ్చేరిలో ఈ నెల 16, 17, 18 తేదీల్లో జరగనున్న జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో అంజలి పాల్గొననుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ పట్టుదలతో చదువును కొనసాగిస్తూ క్రీడల్లోనూ ప్రతిభ కనబరుస్తోంది.తల్లిదండ్రులు లేకపోయినా తన లక్ష్యాన్ని వీడకుండా అంజలి ముందుకు సాగుతోంది. జాతీయ స్థాయిలో ప్రతిభను చాటడంతో పాటు భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నది తన లక్ష్యమని ఆమె తెలిపింది. దాతలు, క్రీడాభిమానులు ప్రోత్సహిస్తే ప్రపంచ స్థాయిలో మరింత మెరుగ్గా రాణిస్తానని పేర్కొంది. అంజలి ప్రతిభను గుర్తించిన వ్యాపారి గంజి శ్రీనివాస్ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించారు. తనకు చేయూతనందించిన శ్రీనివాస్‌కు అంజలి కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా కళాశాల బృందం కూడా శ్రీనివాస్‌కు అభినందనలు, ధన్యవాదాలు తెలిపింది.
ఆర్థిక పరిస్థితులు ప్రతిభకు అడ్డంకిగా మారకుండా అంజలి వంటి ప్రతిభావంతులైన విద్యార్థులను దాతలు ప్రోత్సహించాలని కళాశాల బృందం కోరింది.


Comments
Post a Comment