శివ్వంపేటలో 125 మంది గర్భిణీలకు ప్రోటీన్ కిట్ల పంపిణీ, ధర్నా, కార్యక్రమాలను విజయవంతం చేసిన నాయకులకు, కార్యకర్తలకు కృతఙ్ఞతలు తెలిపిన నవీన్ గుప్తా



 

శివ్వంపేటలో 125 మంది గర్భిణీలకు ప్రోటీన్ కిట్ల పంపిణీ, ధర్నా, కార్యక్రమాలను విజయవంతం చేసిన నాయకులకు, కార్యకర్తలకు కృతఙ్ఞతలు తెలిపిన నవీన్ గుప్తా 

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని శివ్వంపేట మండల కేంద్రంలో రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు గ్రామాలకు చెందిన 125 మంది గర్భిణీ స్త్రీలకు ప్రోటీన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ గర్భిణీలు, తల్లులు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఫౌండేషన్ తరఫున నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా మాట్లాడుతూ నిరుద్యోగుల కోసం జాబ్ మేళాలు, వృద్ధులకు కంటి శిబిరాలు, విద్యార్థుల కోసం మినరల్ వాటర్ ప్లాంట్లతో పాటు అవసరమైన వారికి అండగా నిలుస్తున్న రాజిరెడ్డి నాయకత్వం గర్వకారణమన్నారు. అనంతరం శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తాత మధు, కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కార్యక్రమాలను విజయవంతం చేసిన నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు నవీన్ గుప్తా కృతజ్ఞతలు తెలిపారు.

Comments

Popular posts from this blog

న్యూ అమ్మ హాస్పటల్ సీజ్ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్

కూరగాయలు అమ్ముకొని ఇంటికి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి – నలుగురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ మహిళా ఉద్యోగి మృతి, అందిన పిర్యాదు మేరకు ప్రమాద కారణాలు అన్వేషిస్తున్న పోలీసులు