రైతుల సమస్యల పరిష్కారం కోసం, 22A నిషేధిత భూముల జాబితా నుంచి రైతుల భూములను తొలగించాలని చేయనున్న ధర్నా కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతున్న బిజెపి ఉపాధ్యక్షుడు మాజీ సర్పంచ్ రాజేందర్
రైతుల సమస్యల పరిష్కారం కోసం, 22A నిషేధిత భూముల జాబితా నుంచి రైతుల భూములను తొలగించాలని చేయనున్న ధర్నా కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతున్న బిజెపి ఉపాధ్యక్షుడు మాజీ సర్పంచ్ రాజేందర్
01.09.26: మెదక్, నర్సాపూర్: రైతుల సమస్యల పరిష్కారం కోసం, 22A నిషేధిత భూముల జాబితా నుంచి రైతుల భూములను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు మాజీ సర్పంచ్ రాజేందర్ అన్నారు. తేదీ 02 సెప్టెంబర్ 2026 (బుధవారం), ఉదయం 10:00 గంటలకు నర్సాపూర్ పట్టణ కేంద్రంలో బస్టాండ్ ఎదురుగా నిర్వహించనున్న ఈ ధర్నా కార్యక్రమానికి మల్లేష్ గౌడ్ మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షుడు అధ్యక్షత వహించనున్నారని, ముఖ్య అతిథులుగా
MP రఘునందన్ రావు తో పాటు..రాష్ట్ర స్థాయి నాయకులు హాజరు కానున్న ఈ ధర్నా కార్యక్రమానికి సీనియర్ నాయకులు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, వివిధ మోర్చాల బాధ్యులు, మండల-పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు రాజేందర్ తో పాటు, మండల అధ్యక్షుడు రాకేష్, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, మహిపాల్, కుమార్, రాజు లు పాల్గొన్నారు.

Comments
Post a Comment