27 న పర్యాటక దినోత్సవ వేడుకలను సమిష్టి కృషి తో ఘనంగా నిర్వహించాలి అన్న అదనపు కలెక్టర్ నగేష్ @ మెదక్
27 న పర్యాటక దినోత్సవ వేడుకలను సమిష్టి కృషి తో ఘనంగా నిర్వహించాలి అన్న అదనపు కలెక్టర్ నగేష్ @ మెదక్
మెతుకు సీమ సాంప్రదాయ శోభాయాత్ర ,6 వేల మందితో ర్యాలీ
వివిధ కళారూపాల ప్రదర్శన
పర్యాటక ప్రాంతాలను విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా తీర్చిదిద్దాలి
--అదనపు కలెక్టర్ నగేష్
పర్యాటక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ నగేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టర్ చాంబర్లో జిల్లా లో నిర్వహించే ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమాల ఏర్పాట్లు, నిర్వహణపై పర్యాటక, విద్యా, పురావస్తు, అటవీ, ఇతర శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ... చారిత్రక ఆలయాల వద్ద పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాలు కల్పించాలని, అందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. యువ టూరిజం క్లబ్ లో నమోదయి ఉన్న విద్యార్థులకు పర్యాటక, వారసత్వ సంపద పై మండల, జిల్లా స్థాయి వ్యాసరచన, చిత్రలేఖన, వక్తృత్వ పోటీలను నిర్వహించాలని డీఈఓ, డిఐఈఓలకు సూచించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని సంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు పర్యాటకశాఖ ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. అధికారులకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించుకున్నారు. బారీగా జన సమీకరణ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, పర్యాటక ప్రాంతాలను విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా తీర్చిదిద్దాలన్నారు.
ఈ సమావేశంలో పర్యాటకశాఖ అధికారి, జెడ్పి సీఈఓ ఎల్లయ్య, డిపిఓ యాదయ్య, డి ఈ ఓ రాజు, ఈడీఎం సందీప్ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Comments
Post a Comment