శ్రీ రాయగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలోని శ్రీ విఘ్నేశ్వర నవగ్రహ దేవాలయ 44 వ వార్షికోత్సవం

 శ్రీ రాయగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలోని శ్రీ విఘ్నేశ్వర నవగ్రహ దేవాలయ 44 వ వార్షికోత్సవం



03.09.26: మెదక్, కౌడిపల్లి: వెలమకన్నె గ్రామం శ్రీ రాయగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో వెలిసిన శ్రీ విఘ్నేశ్వర నవగ్రహ దేవాలయము దుందుభి నామ సంవత్సరంలో బ్రహ్మ శ్రీ యగ్నేషానంద నాథ దీక్షానామాంకితులు యావవరం రామదత్త శర్మ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన దేవాలయం క్రమం తప్పకుండా ప్రస్తుతం వారి కుమారుడు యావవరం వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో నవగ్రహ దేవాలయ ధర్మకర్త సర్దన జ్యోతి సుదర్శనం ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా నేటికి 44వ వార్షికోత్సవం వైభవంగా జరపబడింది. ఈ దైవ కార్యక్రమంలో గ్రామ పురోహితులు గట్లంబోట్ల మురళి శర్మ, ఉమ శంకర్ శర్మ, మరియు దేశాయిపేట మెట్టు రాములు శర్మ ఆధ్వర్యంలో సామూహిక హోమ పూజా కార్యక్రమం వైభవంగా జరపబడింది. ఇట్టి కార్యక్రమం శ్రీ రాయగిరి వెంకటేశ్వర స్వామి అర్చక బృందం, గ్రామ మరియు పరిసర గ్రామ భక్తుల సౌజన్యంతో విజయవంతం జరిగినట్లు ఆలయ కమిటీ తెలిపారు తదనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో మెదక్ జిల్లా బిజెపి అధ్యక్షుడు వాల్డాస్ మల్లేష్ గౌడ్, దేవాలయ కమిటీ సభ్యులు, సర్పంచ్, మాజీ సర్పంచ్, మాజీ వైస్ ఎంపీపీ, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ మరియు పరిసర గ్రామాల భక్త జనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.*

Comments

Popular posts from this blog

న్యూ అమ్మ హాస్పటల్ సీజ్ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్

కూరగాయలు అమ్ముకొని ఇంటికి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి – నలుగురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ మహిళా ఉద్యోగి మృతి, అందిన పిర్యాదు మేరకు ప్రమాద కారణాలు అన్వేషిస్తున్న పోలీసులు