రైతు బోనస్ పొందడానికి అర్హమైన 7 రకాల వంగడాలు సూచించి, ఆన్లైన్ చేయించుకోవడం తప్పనిసరి అన్న వ్యవసాయ విస్తరణ అధికారి
రైతు బోనస్ పొందడానికి అర్హమైన 7 రకాల వంగడాలు సూచించి, ఆన్లైన్ చేయించుకోవడం తప్పనిసరి అన్న వ్యవసాయ విస్తరణ అధికారి
08.09.26: మెదక్, నర్సాపూర్: ప్రభుత్వం సిఫారసు చేసినటువంటి *7 రకాల వరి విత్తనాలను సాగు చేసిన రైతులకు బోనస్ గురించి మంతూర్, ఆవంచ, చిప్పల్తుర్తి గ్రామాలలో రైతులకు వ్యవసాయ విస్తరణ అధికారులు అవగాహన కల్పించడం జరిగింది అని మండల వ్యవసాయ అధికారిణి దీపిక తెలిపారు. బోనస్ పొందుటకు రైతు తను విత్తనం కొనుగోలు చేసిన డీలర్ వద్ద కచ్చితంగా ఆన్లైన్ చేసుకోవాలి అని, ఒకవేళ రైతు తన సొంత విత్తనం వాడినా లేకపోతే పరిశోధన స్థానాల(KVK,ARS) నుండి విత్తనాలు కొనుగోలు చేసినా వ్యవసాయ విస్తరణ అధికారికి *స్వీయ ధృవీకరణ* పత్రం అందజేయవలసి ఉంటుంది అని ఆమె తెలిపారు. కావున రైతులు ఎవరైనా కింద పేర్కొనబడిన రకాలు సాగు చేసి ఉంటే ఆన్లైన్ లో నమోదు చేయించుకోగలరని తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో గ్రామ సర్పంచులు వెంకటేశం, స్రవంతి కరుణాకర్, సుధాకర్ ఉపసర్పంచ్లు కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారులు రాజశేఖర్, లావణ్య, తేజస్విని మరియు రైతులు పాల్గొన్నారు.
*ఏడు రకాల వరి విత్తనాలు*
BPT - 5204 (సాంబ మసూరి)
KNM-1638
KNM - 7715
జై శ్రీరామ్
HMT
WGL-44
RNR - 15048 ( తెలంగాణ సోనా)



Comments
Post a Comment