పట్టణ ఓటర్ లు మున్సిపల్ కార్యాలయంలో అందుబాటులో ఉన్న డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను పరిశీలించూకొని తప్పులు ఉంటే సవరణ కోరాలి అంటున్న కమీషనర్
పట్టణ ఓటర్ లు మున్సిపల్ కార్యాలయంలో అందుబాటులో ఉన్న డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను పరిశీలించూకొని తప్పులు ఉంటే సవరణ కోరాలి అంటున్న కమీషనర్
04.09.26: మెదక్, నర్సాపూర్: పురపాలక సంఘ కార్యాలయంలో AERO/కమిషనర్ సాయికుమార్ ఆధ్వర్యంలో ఎస్.ఐ.ఆర్ ప్రక్రియలో భాగంగా BLO లతో సమీక్ష సమావేశము జరిగింది. అనంతరం ఓటరు జాబితా యందు తప్పులు సవరించుకొనుటకు గాను పట్టణంలోని 06,07 (Ps No. 285 & 286) వార్డుల యందు హియరింగ్ నిర్వహించి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. కార్యక్రమంలో కౌన్సిలర్ మొహియుద్దీన్, వార్డు అధికారి రాములు, గ్రామ పాలన అధికారి దుర్గయ్య, ఆంజనేయులు, బిఎల్వోలు, ఆయా వార్డుల ప్రజలు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పట్టణ ఓటర్లు తమ మున్సిపల్ కార్యాలయం నందు అందుబాటులో గల డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను పరిశీలించి అందులో తప్పులు ఉంటే వాటిని సవరించుకొనుటకు వార్డు సభల యందు దరఖాస్తులు సమర్పించాలని కోరారు.


Comments
Post a Comment