నర్సాపూర్ గణేష్ మండపాలను పరిశీలించిన అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపీఎస్


 గణేష్ మండపాలను పరిశీలించిన అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపీఎస్


22.09.26: మెదక్, నర్సాపూర్‌: పట్టణంలోని గణేష్ మండపాలను జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపీఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా మండపాల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, పాయింట్ బుక్‌ను తనిఖీ చేశారు.


గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వాహకులు, యువత పోలీసులకు సహకరించాలని సూచించారు. నిమజ్జన ఊరేగింపులో క్రమశిక్షణ పాటించాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలని తెలిపారు. చెరువులు, కుంటల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను తప్పనిసరిగా పాటించాలని, ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లవద్దని సూచించారు.


మద్యం సేవించి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనరాదని, డీజేలు, అధిక శబ్దంతో కూడిన సౌండ్‌ సిస్టమ్‌ల విషయంలో నిబంధనలు పాటించాలని యువతకు వివరించారు. నిమజ్జనం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అదనపు ఎస్పీ సూచించారు.

Comments

Popular posts from this blog

న్యూ అమ్మ హాస్పటల్ సీజ్ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్

కూరగాయలు అమ్ముకొని ఇంటికి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి – నలుగురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ మహిళా ఉద్యోగి మృతి, అందిన పిర్యాదు మేరకు ప్రమాద కారణాలు అన్వేషిస్తున్న పోలీసులు