తప్పిపోయిన బాలుడి ఆచూకీ కనుగొని, రెండు గంటల్లోనే తల్లిదండ్రులకు అప్పగించిన నర్సాపూర్ పోలీసులు
24.09.26: మెదక్, నర్సాపూర్ప: పట్టణంలోని శ్రీరామ్‌నగర్ కాలనీలోని LIC కార్యాలయం సమీపంలో బాలుడు ఒంటరిగా ఏడుస్తూ కనిపించడంతో, విధుల్లో ఉన్న బ్లూ కొల్ట్స్ పోలీస్ సిబ్బంది మోహన్, సతీష్ వెంటనే బాలుడిని గుర్తించి నర్సాపూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు.
బాలుడి సంరక్షణ బాధ్యతలు చేపట్టిన WPCలు శోభ, కవిత బాలుడికి అవసరమైన ఆహారం అందించి, అతడిని జాగ్రత్తగా చూసుకున్నారు.
విషయం తెలుసుకున్న SHO ఏ. రంజిత్ కుమార్ వెంటనే సిబ్బంది మోహన్, సతీష్, కవిత, శోభలతో కలిసి బాలుడు కనిపించిన ప్రాంతానికి వెళ్లి, సుమారు రెండు గంటల పాటు కాలనీలోని ప్రతి ఇంటిలో విచారణ చేపట్టారు.
ఈ క్రమంలో బాలుడు ఆర్యన్ (వయస్సు 2 సంవత్సరాలు 9 నెలలు) అని, అతని తల్లిదండ్రులు రామ్ గణేష్–రాణి దంపతులని, వారు స్వస్థలం ఛత్తీస్‌గఢ్ కాగా ప్రస్తుతం శ్రీరామ్‌నగర్ కాలనీ, నర్సాపూర్ టౌన్లో నివాసం ఉంటున్నారని గుర్తించారు.
తగిన ఆధారాలతో తల్లిదండ్రులను నిర్ధారించిన అనంతరం బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
విచారణలో రామ్ గణేష్ ప్రతిరోజూ మేస్త్రీ పనికి వెళ్తుండగా, ఆ సమయంలో బాలుడిని అదే కాలనీలో సుమారు 200 మీటర్ల దూరంలో నివసించే తన అత్త రాం కళీ వద్ద ఉంచి వెళ్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో బాలుడు ఇంటి నుంచి బయటకు వెళ్లి తప్పిపోయినట్లు తల్లిదండ్రులు తెలిపారు.
బాలుడి ఆచూకీని త్వరితగతిన కనుగొని, సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించిన బ్లూ కొల్ట్స్ సిబ్బంది మోహన్, సతీష్, WPCలు కవిత, శోభలను SHO ఏ. రంజిత్ కుమార్ అభినందించారు.
బాలుడిని క్షేమంగా తమకు అప్పగించినందుకు బాలుడి తల్లిదండ్రులు రామ్ గణేష్–రాణి దంపతులు నర్సాపూర్ పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పోలీసుల తక్షణ స్పందన, చొరవ, కృషిని వారు అభినందించారు.
“ప్రజల భద్రతే మా బాధ్యత – ప్రతి చిన్నారి క్షేమమే మా కర్తవ్యం.”
ఇట్లు మీ రంజిత్ కుమార్, SHO-నర్సాపూర్ పోలీస్ స్టేషన్, మెదక్ జిల్లా

Comments
Post a Comment