గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల ఎత్తివేత అపోహే..! అన్న ప్రాంతీయ సమన్వయకర్త ఎన్. గంగారామ్ నాయక్
గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల ఎత్తివేత అపోహే..! అన్న ప్రాంతీయ సమన్వయకర్త ఎన్. గంగారామ్ నాయక్
26.09.26: మెదక్, నర్సాపూర్: పట్టణంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర జూనియర్ కళాశాలను ఎత్తివేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని గిరిజన సంక్షేమ విద్యాలయాల సంస్థ ప్రాంతీయ సమన్వయకర్త ఎన్. గంగారామ్ నాయక్ స్పష్టం చేశారు. శనివారం ఆయన నర్సాపూర్‌లోని గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జూనియర్ కళాశాల, పాఠశాల సిబ్బందితో సమావేశం నిర్వహించి, కళాశాలలోని రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ సమన్వయకర్త మాట్లాడుతూ, నర్సాపూర్ పట్టణంలోని జూనియర్ కళాశాల 1996లో ఆవిర్భవించిందని, ప్రస్తుతం కూడా అదే విధంగా కొనసాగుతోందని తెలిపారు. కళాశాలను కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా గుర్తించినందున, అందుకు అనుగుణంగా విద్యాబోధన కొనసాగుతోందని చెప్పారు. విద్యార్థుల అడ్మిషన్లు రద్దు కాలేదని, ప్రస్తుతం జరుగుతున్నది కేవలం సర్దుబాటు ప్రక్రియ మాత్రమేనని స్పష్టం చేశారు. అలాగే ఉద్యోగులను తొలగించినట్లు జరుగుతున్న ప్రచారంలో కూడా అవావస్తవమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన IFMIS పోర్టల్ ఆధారంగా ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. జీవో నం. 1349 ప్రకారం పార్ట్‌టైమ్ ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ చేపడుతున్నట్లు ఎన్. గంగారామ్ నాయక్ వెల్లడించారు. గురుకుల జూనియర్ కళాశాల కొనసాగింపుపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, విద్యార్థులు, తల్లిదండ్రులు అపోహలకు గురికావద్దని ఆయన సూచించారు. విద్యార్థులకు ట్రంకు పెట్టెలు, తెలుగు అకాడమీ పుస్తకాలు కూడా గంగారాం నాయక్ పంపిణీ చేశారు.


Comments
Post a Comment