పోషణ మాసం సందర్భంగా గర్భిణీలకు పోషణపై అవగాహన @ నర్సాపూర్

 

పోషణ మాసం సందర్భంగా గర్భిణీలకు పోషణపై అవగాహన @ నర్సాపూర్

11.09.26: మెదక్, నర్సాపూర్: పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో పోషణ మాస ఉత్సవాల్లో భాగంగా గర్భిణీలకు పోషకాహారం మరియు ఆరోగ్యంపై ICDS ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ, మున్సిపల్ కమిషనర్ మరియు జిల్లా సంక్షేమ అధికారి (DWO) హేమ భార్గవి హాజరయ్యారు. ఈ సందర్భంగా గర్భిణీలు ప్రతిరోజూ సమతుల్యమైన పోషకాహారం తీసుకోవాలని, ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు తదితర పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు. గర్భధారణ సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, వైద్యుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ వస్మతి, అంగన్వాడీ టీచర్లు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

న్యూ అమ్మ హాస్పటల్ సీజ్ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్

కూరగాయలు అమ్ముకొని ఇంటికి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి – నలుగురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ మహిళా ఉద్యోగి మృతి, అందిన పిర్యాదు మేరకు ప్రమాద కారణాలు అన్వేషిస్తున్న పోలీసులు