వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ సూచించిన నిబంధనలు, భద్రతా చర్యలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలన్న DSP

 09.09.26: మెదక్, నర్సాపూర్: పట్టణంలోని యాదవ ఫంక్షన్ హాల్‌లో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించబడింది. సమావేశానికి హాజరైన తూప్రాన్ డీఎస్పీ వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి మాట్లాడుతూ, వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ సూచించిన నిబంధనలు, భద్రతా చర్యలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.


మండపాల వద్ద శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని సూచించారు. అనంతరం నర్సాపూర్ పట్టణంలోని రాయరావు చెరువును సందర్శించి విగ్రహాల నిమజ్జనం కోసం ఏర్పాటు చేయాల్సిన ప్రదేశాన్ని సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో CI రంగ కృష్ణ, మున్సిపల్ చైర్మన్, కమిషనర్, మున్సిపల్ కౌన్సిలర్లు, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, వినాయక మండపాల నిర్వాహకులు మరియు ఆర్గనైజర్లు హాజరయ్యారు.

Comments

Popular posts from this blog

న్యూ అమ్మ హాస్పటల్ సీజ్ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్

కూరగాయలు అమ్ముకొని ఇంటికి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి – నలుగురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ మహిళా ఉద్యోగి మృతి, అందిన పిర్యాదు మేరకు ప్రమాద కారణాలు అన్వేషిస్తున్న పోలీసులు