*సంగారెడ్డి నియోజకవర్గం లో SC సెల్ జిల్లా చైర్మన్ శ్రీ గంగేరి శ్రీహరి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ SC సెల్ టౌన్ కమిటీ మరియు మండల కమిటీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల భారీ బైక్ ర్యాలీ*

 *సంగారెడ్డి నియోజకవర్గం లో SC సెల్ జిల్లా చైర్మన్ శ్రీ గంగేరి శ్రీహరి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ SC సెల్ టౌన్ కమిటీ మరియు మండల కమిటీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల భారీ బైక్ ర్యాలీ* 


*కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజులు పూర్తిచేసుకున్న సదర్భంగా కంది, కొండాపూర్, సంగారెడ్డి పట్టణం లో జెండా ఊపి బైక్ ర్యాలీ లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి గారు.

*మ్యానిఫెస్టో లో లేని సంక్షేమ పథకాలు సైతం అమలుచేస్తోన్న కాంగ్రెస్ ప్రభుత్వం*

*పార్టీలకతీతంగా పేదలందరికి కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయి*

-*డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 1000 రోజులు పూర్తయిన సందర్భంగా సంగారెడ్డి నియోజకవర్గం లో కాంగ్రెస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కంది, కొండాపూర్ మండల కేంద్రాల్లో, సంగారెడ్డి పట్టణం లో డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి గారు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు.


సంగారెడ్డి పట్టణం లో రామ్ మందిర్ నుండి ప్రారంభమైన ర్యాలీ భవానీ మందిర్, నల్సాబ్ గడ్డ, రుక్మిణి థియేటర్, శాంతి నగర్ ల మీదుగా రాజంపేట, ఇందిరా నగర్, తార డిగ్రీ కాలేజ్, బైపాస్ రోడ్డు మీదుగా ఐబీ నెహ్రూ జంక్షన్ దాకా కొనసాగింది. ర్యాలీ పూర్తయిన అనంతరం ఐబీ జంక్షన్ వద్ద మాజీ ప్రధానులు నెహ్రూ, రాజీవ్ గాంధీ ల విగ్రహాలకు నిర్మలా జగ్గారెడ్డి గారు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.


ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి గారు మాట్లాడుతూ దేశం లో ఎక్కడా లేనివిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టిందని అంతేకాకుండా కోటికి పైగా రేషన్ కార్డులు అందించదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మూడేళ్ల కాలం లో మహిళ సంఖేమమే ధ్యేయంగా మహిళ కోసం ఉచిత బస్సు లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు. గత ప్రభుత్వం లో డబుల్ బెడ్ రూమ్ పథకం నామ్ కే వాస్తే గా సాగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల సొంతింటి కలను సాకారం చేస్తోందని ఆనందం వ్యక్తంచేశారు.


ఈ కార్యక్రమంలో SC సెల్ టౌన్ కమిటీ సభ్యులు,ఆత్మ ఛైర్మెన్ ప్రభుగారు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జార్జ్,మున్సిపల్ ఛైర్మన్ కూన సంతోష్ గారు,పట్టణ అధ్యక్షుడు కిరణ్ గౌడ్ గారు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్స్, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, TJR అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేశారు. 🙏


                 ఇట్లు, 

             గంగేరి శ్రీహరి 

సంగారెడ్డి జిల్లా SC సెల్ కమిటీ చైర్మన్.

Comments

Popular posts from this blog

న్యూ అమ్మ హాస్పటల్ సీజ్ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్

కూరగాయలు అమ్ముకొని ఇంటికి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి – నలుగురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ మహిళా ఉద్యోగి మృతి, అందిన పిర్యాదు మేరకు ప్రమాద కారణాలు అన్వేషిస్తున్న పోలీసులు