దొరికిన బ్యాగులోని ఐఫోన్, రూ.10 వేల నగదు, రెండు బంగారు ఉంగరాలను యజమానికి అప్పగించి నిజాయితీ చాటుకున్న పోలీసు సిబ్బంది, అభినందించిన మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్
24.10.26: మెదక్, పాపన్నపేట: ఏడుపాయల దేవాలయ ప్రాంగణంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది శ్రీకాంత్, భూపాల్ నిజాయితీని తమ బాధ్యతలు గుర్తెరిగి వ్యవహరించుకున్నారు. ఏడుపాయల ఆలయ గోపురం వద్ద వారికి ఒక నల్ల బ్యాగు దొరికగా.. దానిని తెరిచి చూసిన వారికి ఒక ఐఫోన్, రూ.10 వేల నగదు, రెండు బంగారు ఉంగరాలు ఆగుపించాయి. వెంటనే ఆ బ్యాగును తీసుకొని ఆలయ ఈఓ కార్యాలయానికి వెళ్లి, యజమాని కోసం వేచి ఉన్నారు. ఇంతలో కూకట్‌పల్లికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి అక్కడికి వచ్చి తన బ్యాగు పోయిందని తెలిపాడు. బ్యాగులోని వస్తువుల వివరాలను అడిగి నిర్ధారించుకున్న అనంతరం, ఆలయ ఈఓ సమక్షంలో బ్యాగును యజమానికి అప్పగించారు. దొరికిన విలువైన వస్తువులను భద్రంగా ఉంచి, వాటిని యజమానికి తిరిగి అందించిన పోలీసు సిబ్బంది శ్రీకాంత్, భూపాల్ నిజాయితీ, బాధ్యతాయుతమైన విధి నిర్వహణను మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ అభినందించారు. విధి నిర్వహణలో నిజాయితీ, నిబద్ధతతో వ్యవహరిస్తూ ప్రజలకు పోలీసు శాఖపై నమ్మకాన్ని మరింత పెంచాలని ఈ సందర్భంగా సూచించారు.

Comments
Post a Comment