ఎర్ర సూర్యుడు కామ్రేడ్ చిలుముల విట్టల్ రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి మరియు itarulu




19.10.26: మెదక్, నర్సాపూర్: కీర్తిశేషులు, మాజీ ఎమ్మెల్యే, ప్రజా నాయకుడు కామ్రేడ్ చిలుముల విట్టల్ రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి.


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎర్ర సూర్యుడు కామ్రేడ్ చిలుముల విట్టల్ రెడ్డి గారు ప్రజల సంక్షేమం కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రజల హక్కుల కోసం, వారి అభ్యున్నతి కోసం ఆయన చేసిన పోరాటాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, ఆయన చూపిన మార్గంలో నడుస్తామని తెలిపారు. ప్రజాసేవకు ఆయన జీవితం ఒక ఆదర్శమని, ప్రజల హృదయాల్లో ఆయన ఎప్పటికీ నిలిచిపోతారని అన్నారు.


ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్, మాజీ వైస్ ఎంపీపీ నర్సింగ్ రావు, మాజీ సర్పంచ్ రమణారావు, కౌన్సిలర్ చింతకుంట శ్రీకాంత్, రాధాకృష్ణ, మన్నె వెంకటేష్, బిక్షపతి, శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొని కామ్రేడ్ విట్టల్ రెడ్డికి ఘన నివాళులర్పించారు.

Comments

Popular posts from this blog

న్యూ అమ్మ హాస్పటల్ సీజ్ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్

కూరగాయలు అమ్ముకొని ఇంటికి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి – నలుగురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ మహిళా ఉద్యోగి మృతి, అందిన పిర్యాదు మేరకు ప్రమాద కారణాలు అన్వేషిస్తున్న పోలీసులు