*ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ ఛాంపియన్ కార్యక్రమం* @ నర్సాపూర్, మెదక్


 *ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ ఛాంపియన్ కార్యక్రమం*


03.10.26: మెదక్, నర్సాపూర్: నియోజకవర్గంలోని నర్సాపూర్, శివంపేట, చిలిపిచేడు, కౌడిపల్లి మండలాలకు చెందిన అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులు, ఐకేపీ సిబ్బందితో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ ఛాంపియన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో నర్సాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీ రాజు యాదవ్ పాల్గొని మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం వివిధ శాఖలలో పనిచేస్తున్న సిబ్బంది అందిస్తున్న సేవలను అభినందిస్తూ, గ్రామాల్లో ప్రజల ఆరోగ్యం, పోషణ, అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వారందరూ పోషణ ఛాంపియన్లని కొనియాడారు. ముఖ్యంగా “ఆరోగ్యమే మహాభాగ్యం” అని, ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. సీడీపీవో హేమా భార్గవి మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరి సహకారం ఎంతో అవసరమని తెలిపారు. గ్రామాల్లో పనిచేస్తున్న అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేసినప్పుడే ఆరోగ్యవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దగలమని పేర్కొన్నారు.

అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలవుతున్న ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించడంతో పాటు, అంగన్‌వాడీ కేంద్రాల ఆవరణలో ఏర్పాటు చేసుకున్న కిచెన్ గార్డెన్లలో పండించిన ఆకుకూరలు, కూరగాయలను ఆహారంలో భాగంగా వినియోగించాలని సూచించారు. సేంద్రీయ పద్ధతుల్లో పండించిన ఆకుకూరలు, కూరగాయలతో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తయారుచేసి అందించడం ద్వారా తల్లులు, పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చని తెలిపారు. ఆరోగ్యవంతమైన భవిష్యత్ తరాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలిపారు.

ఈ కార్యక్రమానికి హాజరైన ఎన్జీవో ప్రతినిధి సునీత రాకేష్ మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ తమ జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఏరియా ఆసుపత్రి న్యూట్రిషన్ డైటిస్ట్ మల్లయ్య మాట్లాడుతూ.. ఆరోగ్యం విషయంలో ఆహార భద్రతలు కచ్చితంగా పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు మరియు ఐకెపి APMలు అంగన్వాడీ టీచర్లు, ఆశాలు, పంచాయతీ కార్యదర్శిలు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

న్యూ అమ్మ హాస్పటల్ సీజ్ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్

కూరగాయలు అమ్ముకొని ఇంటికి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి – నలుగురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ మహిళా ఉద్యోగి మృతి, అందిన పిర్యాదు మేరకు ప్రమాద కారణాలు అన్వేషిస్తున్న పోలీసులు