ప్రాజెక్ట్ స్థాయి పోషణ మాసం కార్యక్రమం లో పాల్గొని అంగన్వాడీ సేవలను అభినందించిన ఎమ్మెల్యే వాకిటి సునీతా రెడ్డి
09.10.26: మెదక్, నర్సాపూర్: రైతు వేదిక లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సునీతా రెడ్డి హాజరై అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో అంగన్వాడీ టీచర్లు ఎంతో అద్భుతమైన సేవలు అందిస్తున్నారని తెలిపారు. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి శిశువు జన్మించిన అనంతరం కూడా తల్లి, బిడ్డల ఆరోగ్య పరిరక్షణకు అంగన్వాడీ టీచర్లు నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ రాజు యాదవ్ మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్లు పోషణ అనేక కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరికి పోషణ గురించి వివరించడం జరుగుతుంది అని తెలిపారు. ఆరోగ్య పోషణ గురించి అంగన్వాడీ టీచర్ పాత్ర ఎంతో ఉంటుందని కొనియాడారు. కార్యక్రమంలో పాల్గొన్న డీడబ్ల్యూఓ హేమాభార్గవి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ బయట లభించే జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని, ఇంట్లోనే పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తయారు చేసి పిల్లలకు అందించాలని సూచించారు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలతో కూడిన సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం ద్వారా పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చని తెలిపారు. గతంలో తీవ్ర పోషకాహార లోపంతో బాధపడిన పిల్లలను సాధారణ బరువు స్థాయికి తీసుకురావడంలో సాధించిన విజయాలను కార్యక్రమంలో భాగంగా వివిధ మండలాల నుంచి వచ్చిన, తల్లులు వివరించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిన సేవలు, పిల్లల పెంపకంలో తీసుకున్న జాగ్రత్తలు, పోషకాహారం అందించడం ద్వారా మెరుగుపడ్డ పిల్లల ఆరోగ్యం వివరించారు. అనంతరం పోషణ మాసంలో అంగన్వాడీ కేంద్రాలలో పోషణ కార్యక్రమాలు నిర్వహించిన బెస్ట్ అంగన్వాడీ టీచర్లను ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరిగింది. కార్యక్రమానికి మండల ఎంఈఓ, RBSK డా. శ్రీలత మరియు ఐసిడిఎస్ సూపర్వైజర్లు అంగన్వాడీ టీచర్లు వివిధ గ్రామాల నుంచి వచ్చిన తల్లులు పాల్గొన్నారు. అనంతరం నర్సాపూర్ బస్టాండ్ లో గల బిడ్డకు పాలు ఇవ్వడానికి పాలిచ్చే కేంద్రాన్ని ప్రారంభించడం జరిగినది.


Comments
Post a Comment