అప్పులు తీర్చే మార్గం తోచక రైతు తలారి ఆంజనేయులు ఆత్మహత్య
అప్పులు తీర్చే మార్గం తోచక రైతు తలారి ఆంజనేయులు ఆత్మహత్య
13.10.26: మెదక్, నర్సాపూర్: ఆవంచ గ్రామానికి చెందిన తలారి ఆంజనేయులు, తండ్రి పేరు రమేష్, వయస్సు 36 సంవత్సరాలు, కులం ముదిరాజ్, వృత్తి వ్యవసాయం, గత 15 సంవత్సరాల క్రితం తలారి లావణ్య, వయస్సు 34 సంవత్సరాలు, కులం ముదిరాజ్,ను వివాహం చేసుకొని కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. కుమారుడు తలారి మనివర్ధన్, వయస్సు 13 సంవత్సరాలు, 7వ తరగతి చదువుతుండగా, కుమార్తె మధుచందన, వయస్సు 11 సంవత్సరాలు, 6వ తరగతి చదువుతోంది.
గత కొన్ని రోజులుగా వ్యవసాయ అవసరాలు మరియు ట్రాక్టర్‌కు సంబంధించిన ఖర్చుల కోసం అప్పులు తీసుకొని వ్యవసాయం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆంజనేయులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయమై ఆయన తరచూ ఆందోళన వ్యక్తం చేసేవాడని, భార్య లావణ్య ధైర్యం చెబుతూ అప్పులు క్రమంగా తీర్చుకుందామని భరోసా ఇచ్చేదని తెలిపింది.
ఈ క్రమంలో, తేదీ 12.10.2026 రాత్రి ఆర్థిక ఇబ్బందుల విషయమై ఆంజనేయులు బాధపడుతుండగా భార్య ఆయనకు సర్ది చెప్పింది. అనంతరం రాత్రి సుమారు 9:00 గంటలకు కుటుంబ సభ్యులందరూ భోజనం చేసి నిద్రించారు. తేదీ 13.10.2026 తెల్లవారుజామున సుమారు 3:00 గంటలకు లేచి చూడగా భర్త ఇంట్లో కనిపించకపోవడంతో బయటకు వెళ్లి చూడగా, ఇంటి ఎదురుగా ఉన్న మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌కు సంబంధించిన బీమ్‌కు నైలాన్ తాడుతో ఉరివేసుకున్న స్థితిలో కనిపించినట్లు భార్య తెలిపింది.
ఆమె కేకలు వేయడంతో పిల్లలు పక్కింటి వారికి సమాచారం అందించారు. వెంటనే తలారి శ్రీశైలం, తండ్రి బిక్షపతి, మరియు తలారి మల్లేశం, తండ్రి బాలయ్య, అక్కడికి చేరుకొని ఘటనను గమనించారు. అనంతరం మృతదేహాన్ని నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, తన భర్త మరణంపై ఎవరి పట్లా ఎలాంటి అనుమానం లేదని తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు చట్టప్రకారం తదుపరి చర్యలు చేపడుతున్నారు.
— నర్సాపూర్ పోలీస్ స్టేషన్, మెదక్ జిల్లా

Comments
Post a Comment