నాయకుల, అధికారుల బాధ్యత రాహిత్యం తో అంబేద్కర్ విగ్రహం లేని జిల్లా కేంద్రంగా మారిన మెదక్
నాయకుల, అధికారుల బాధ్యత రాహిత్యం తో అంబేద్కర్ విగ్రహం లేని జిల్లా కేంద్రంగా మారిన మెదక్
15.10.26: జిల్లా కేంద్రం అయిన మెదక్ పట్టణంలో రోడు విస్తరణలోని భాగంలో తొలగించిన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహంను తిరిగి ప్రతిష్టించడంలో ప్రజా ప్రతినిధులు, స్థానిక శాసనసభ సభ్యులు , జిల్లా ఎస్ సి డి డి అధికారులు, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, చైర్మన్లు నిర్లక్ష్యం వహించకుండా వెంటనే అంబేద్కర్ విగ్రహంను ఆవిష్కరణ చేయాలని దళిత రత్న అవార్డు గ్రహీత,హోళియదాసరి హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ తరపున శాఖమూరి యాదగిరి హోలియదాసరి డిమాండ్ చేశారు. గతంలో జిల్లా కేంద్రంలో రెండు అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయని 1. రాందాస్ చౌరస్తా లో 2 . పోస్ట్ ఆఫీస్ దగ్గరలో ఉండగా ప్రస్తుతం ఒక్క విగ్రహం కూడా అధికారికంగా ఆవిష్కరణకు నోచుకోకపోవడం ఆవేదన బాధ కలిగి స్తోందని అన్నారు. అంబేద్కర్ వర్థంతి 06.12.2026 రోజున ఒక్క విగ్రహంను ఆవిష్కరణకు, మరొక విగ్రహంనకు పునః ప్రతిష్టించి ఆవిష్కరణకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహలు ఆవిష్కరించకపోతే 59 దళిత సంఘాలు, ప్రజా సంఘాలను కలుపుకోని తామే అంబేద్కర్ విగ్రహన్ని ఆవిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని ఈ సందర్భంగా ఆయన అధికారులకు, నాయకులకు తెలిపారు.


Comments
Post a Comment