గుడుంబా తయారీపై దాడి చేసి – అక్రమ బెల్ట్‌షాపులపై కేసుల నమోదు చేసి ఎక్సైజ్ అధికారులు




24.10.26: మెదక్, నర్సాపూర్: ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ మెదక్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ మరియు శాఖ జిల్లా అధికారి ఆదేశాల మేరకు నర్సాపూర్ ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు, దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా శివంపేట మండలంలోని పాంబండ గ్రామ సమీపంలోని భీమ్లా తండా పరిసర ప్రాంతంలో అక్రమంగా గుడుంబా (నాటుసారా) తయారు చేస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక నిందితుడిని అరెస్టు చేసి, 2 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 30 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి, సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు. అలాగే.. అనధికారికంగా ఐఎంఎల్ మద్యం విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు రెండు బెల్ట్‌షాపులపై తనిఖీలు నిర్వహించి, నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి రెండు కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా 4.32 లీటర్ల ఐఎంఎల్ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ గులాం ముస్తఫా పర్యవేక్షణలో, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ట్రైనీ ఇన్‌స్పెక్టర్ జ్ఞానేశ్వర్, ఎస్‌ఐ డి. శరత్ కుమార్, ట్రైనీ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ సచిరథ, ఎక్సైజ్ సిబ్బంది రవి, హెడ్ కానిస్టేబుల్ స్వామి, ఎక్సైజ్ కానిస్టేబుళ్లు మహేశ్ కుమార్, షాహిద్, రాజశేఖర్ తదితరుల భాగస్వామ్యంతో నిర్వహించబడ్డాయి. అక్రమ మద్యం తయారీ, విక్రయాలు మరియు ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అక్రమ మద్యం తయారీ, విక్రయాలకు సంబంధించిన సమాచారం ఉంటే ఎక్సైజ్ శాఖ అధికారులకు తెలియజేయాలని ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ అధికారులు కోరుతున్నారు. 


Comments

Popular posts from this blog

న్యూ అమ్మ హాస్పటల్ సీజ్ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్

కూరగాయలు అమ్ముకొని ఇంటికి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి – నలుగురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ మహిళా ఉద్యోగి మృతి, అందిన పిర్యాదు మేరకు ప్రమాద కారణాలు అన్వేషిస్తున్న పోలీసులు