తమ పని తీరు తో పంచాయతీ రాజ్ డిప్యూటీ కమిషనర్ చే గౌరవించబడ్డ ఎల్లారెడ్డి గూడా తండా సర్పంచ్, సెక్రటరీ లు
16.10.25: మెదక్, నర్సాపూర్: డిప్యూటీ కమిషనర్, పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ, హైదరాబాద్ పి.జె. వెస్లీ మండలంలోని ఎల్లారెడ్డిగూడ తండా గ్రామ పంచాయతీని సందర్శించి, క్రింది అంశాలను పరిశీలించారు.
* గ్రామ పంచాయతీ రికార్డులు మరియు వాటి నిర్వహణ.
* 15వ ఆర్థిక సంఘం (FFC) నిధులకు సంబంధించిన చెల్లింపుల ప్రక్రియ.
* గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక అమలు.
* గత మూడు నెలలుగా పంచాయతీ కార్యదర్శి ఆన్‌లైన్ హాజరు వివరాలు.
* నాలుగు రకాల వ్యర్థాల వేరు వేరు సేకరణ మరియు నిర్వహణ.
* గ్రామ పంచాయతీ ఆస్తుల పరిరక్షణ మరియు రికార్డుల నిర్వహణ.
గ్రామ పంచాయతీ యొక్క మొత్తం పనితీరు మరియు కార్యకలాపాలను పరిశీలించిన అనంతరం, డిప్యూటీ కమిషనర్ సంతృప్తి వ్యక్తం చేసి, పంచాయతీ కార్యదర్శి మరియు సర్పంచ్ ల కృషిని అభినందిస్తూ శాలువాలతో సత్కరించారు.
తర్వాత ఘన వ్యర్థాల నిర్వహణ (SWM) షెడ్, వ్యర్థాల వేరు చేసే కేంద్రం, కంపోస్టింగ్ యూనిట్, పల్లె ప్రకృతి వనం మరియు నర్సరీలను సందర్శించి, సేంద్రీయ ఎరువు తయారీ ప్రక్రియను పరిశీలించారు.
ఈ పర్యటనలో డీపీఓ, డీఎల్‌పీఓ, ఎంపీఓ, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ మరియు గ్రామస్థులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేసుకున్నారు.


Comments
Post a Comment