ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో తన నియోజకవర్గపు సమస్యలు మంత్రి అధికారుల దృష్టికి తెచ్చిన MLA సునీతరెడ్డి @ సంగారెడ్డి
27.10.26: మెదక్, నర్సాపూర్: జిల్లా కేంద్రం అయిన సంగారెడ్డిలో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు అయిన ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో నర్సాపూర్ MLA సునీతరెడ్డి పాల్గొని తన నియోజకవర్గం లోని నవాబ్‌పేట, రత్నాపూర్, కొంగోడు, ఎం. జలాల్‌పూర్, రైలాపూర్ తండా గ్రామాల భూ సమస్యలు, వారిగుంతం, సంగాయిపేట, కుల్చారం, చిన్నఘనపూర్, ఎనగండ్ల, అంసాన్‌పల్లి గ్రామాల్లో పీఓటీ పట్టాల సమస్యలను, మంత్రి మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అలాగే నర్సాపూర్, దొంతి, హత్నూర ప్రాంతాల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు అందించాలని కోరడం జరిగింది.


Comments
Post a Comment