ఎక్సైజ్, STF సంయుక్త దాడులలో 372 గ్రాముల ఆల్ప్రాజోలం, 13.23 గ్రాముల MDMA స్వాధీనం
15.10.26: మెదక్, నర్సాపూర్: మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ మరియు విక్రయాలను అరికట్టేందుకు డిప్యూటీ కమిషనర్, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ మరియు జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి, మెదక్ జిల్లా వారి ఆదేశాల మేరకు ఎక్సైజ్ STF మరియు స్థానిక ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించినట్లు ఎక్సైజ్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ గులాం ముస్తఫా తెలిపారు. ఈ దాడుల్లో 372 గ్రాముల ఆల్ప్రాజోలం, 13.23 గ్రాముల MDMA, ఒక ద్విచక్ర వాహనం మరియు రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా, మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని తెలిపారు. ఈ దాడుల్లో హైదరాబాద్ STF ఇన్‌స్పెక్టర్ S. రమేష్, నర్సాపూర్ ఎక్సైజ్ స్టేషన్ SHO మరియు సబ్-ఇన్‌స్పెక్టర్ D. శరత్ కుమార్, అండర్ ట్రైనింగ్ అధికారి జ్ఞానేశ్వర్ మరియు ఇతర ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కేసులో A1 ఆగమయ్యల మోహన్ గౌడ్, A2 కోటగిరి శ్రీకాంత్ గౌడ్‌లను అరెస్ట్ చేసి, NDPS చట్టం ప్రకారం తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు. మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. మాదకద్రవ్యాల మూలాలు, సరఫరాదారులు మరియు అక్రమ రవాణా నెట్‌వర్క్‌పై దర్యాప్తు కొనసాగుతోంది.
ఉన్నతాధికారుల ఆదేశాలను పకడ్బందీగా అమలు చేస్తూ, మాదకద్రవ్యాల అక్రమ విక్రయాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. యువతను మాదకద్రవ్యాల బారి నుంచి రక్షించేందుకు ఎక్సైజ్ శాఖ నిరంతరం నిఘా కొనసాగిస్తూ, ఇటువంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది అని e సందర్భంగా CI గులామ్ ముస్తఫా తెలిపారు.

Comments
Post a Comment