మెదక్ ఎమ్మెల్యే జన్మదిన ఫ్లెక్సీలను చించిన వ్యక్తుల గుర్తింపు – కేసు నమోదు చేసిన పోలీసులు




 06.11.26: మెదక్, నర్సాపూర్: పట్టణంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చౌరస్తా మరియు మెదక్ రోడ్ లో గుర్తుతెలియని వ్యక్తులు చించివేసిన ఘటనపై వచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలు మరియు ఇతర సమాచారంతో ఫ్లెక్సీలను చించివేసిన వ్యక్తులను గుర్తించడం జరిగింది.


వారిలో:


1. మహమ్మద్ అక్బర్ – నారాయణపూర్ గ్రామం.

2. బలిజ అజయ్ కుమార్ – నారాయణపూర్ గ్రామం.

3. వెంకట సాయి – నారాయణపూర్ గ్రామం.


విచారణలో భాగంగా, సదరు ఫ్లెక్సీలలో తమ ఫోటోలు ఏర్పాటు చేయలేదనే కోపంతోనే వాటిని చించివేసినట్లు వారు అంగీకరించారు అని, ఈ సందర్భంగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు లేదా ఇతరుల ఫ్లెక్సీలు, బ్యానర్లు, ఆస్తులను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేయడం చట్టరీత్యా నేరం అని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని SI రంజిత్ కుమార్ రెడ్డి తెలిపారు. 

Comments

Popular posts from this blog

న్యూ అమ్మ హాస్పటల్ సీజ్ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్

కూరగాయలు అమ్ముకొని ఇంటికి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి – నలుగురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ మహిళా ఉద్యోగి మృతి, అందిన పిర్యాదు మేరకు ప్రమాద కారణాలు అన్వేషిస్తున్న పోలీసులు