రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామికీ దళితులపై దాడులు అరికటండి అంటూ వినతిపత్రం అందించిన దళితులపై దాడుల వ్యతిరేక పోరాట కమిటీ
09.11.26: మెదక్, నర్సాపూర్: జిల్లాలో దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, దాడి చేసినవారిని చట్ట ప్రకారం శిక్షించాలని జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామికీ జిల్లా దళితులపై దాడుల వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందచేశారు. ఈ సందర్బంగా కేవీపీస్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కడారి నాగరాజు, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు కల్లూరి సంజీవ, JMM రాష్ట్ర నాయకులు ఊరట్ల శివ, MCF జిల్లా నాయకులు ఆనంద్, MRPS జిల్లా సీనియర్ నాయకులు బిక్షపతి లు మాట్లాడుతూ.. మనోహరాబాద్ మండలం కొనాయిపల్లి (పి టి), కుచారం, తుప్రాన్ మండలం కిష్టాపూర్, శివ్వంపేట్ మండలం నవాబ్ పేట్ గ్రామాల్లో బతుకమ్మ ఉత్సవాల సందర్బంగా దళితులపై దాడులు, దౌర్జన్యాలు జరిగాయన్న ఆవేదన వ్యక్తం చేశారు. కొనాయిపల్లి గ్రామంలో డప్పులు కొట్టడానికి కనీస వేతనం ఇవ్వాలని అడిగినందుకు గ్రామ సర్పంచ్ మన్నే కళ్యాణ్ వారీ అనుచరులు ముకుమ్మడిగా 40 మంది దళితులపై దాడి చేసి గాయపరిచారని అన్నారు. సర్పంచ్ వారీ అనుచరులు చేసిన దాడిలో విధి నిర్వహణలో ఉన్న ముగ్గురు గ్రామ పంచాయతీ కార్మికులకు తీవ్రంగా గాయాలు అయ్యాయని గుర్తుచేసారు. కుచారం గ్రామంలో దళిత సర్పంచ్ బతుకమ్మ ఉత్సవాల కోసం ఏర్పాట్లు చేస్తే గ్రామానికి చెందిన అగ్రవర్ణాలకు చెందిన మహిళలు దళిత సర్పంచ్ ఏర్పాటు చేసిన స్థలంలో మేము ఎందుకు బతుకమ్మ ఆడాలి.. మేము అక్కడ బతుకమ్మ ఆడము అని చెప్పడం అంటే.. దళిత సర్పంచ్ పట్ల కులవివక్షత పాటించడమే అవుతుంధన్నారు. ఎందుకు ఇక్కడకు రాలేరని అడిగిన సర్పంచ్ మరియు వారీ కుటుంబ సభ్యులపై దాడి చేసారన్నారు. తుప్రాన్ మండలం కిష్టాపూర్ గ్రామంలో గత సంవత్సరం బతుకమ్మ ఉత్సవాల్లో దళిత మహిళలు పాల్గొంటే గ్రామనికి చెందిన అగ్రకులాల వాళ్ళు అడ్డుకున్నారు. ఈ సంవత్సరం కూడా దళిత మహిళలు బతుకమ్మ ఉత్సవాలు జరిపారు. దీన్ని జీర్ణించుకోలేని అగ్రకులాల వాళ్ళు దళితులను పనులకు పిలవడం మానేయడం సిగ్గుచేటు అన్నారు. శివ్వంపేట్ మండలం నవాబ్ పేట్ గ్రామంలో బతుకమ్మ ఊరేగింపు సందర్బంగా గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, హరి గౌడ్, రవి గౌడ్ లు కులం పేరుతో ద్వేషించి, చంది సాయిలు, చంది సన్నీ కుమార్ పై ఆకారణంగా దాడి చేసారని, సన్నీ కుమార్ గొంతు పిసకడంతో గొంతుకు తీవ్రమైన గాయాలు అయ్యాయి అన్నారు. దళితులైన మీకు ఇంత అహంకారం ఉంటే మాకు ఎంత ఉండాలి, మీ అంతు చూస్తాం అంటూ బెదిరిస్తున్నారు. వెల్దుర్తి మండలం ఎదులపల్లి గ్రామంలో బతుకమ్మ ఉత్సవాల సందర్బంగా దాడి జరిగిందన్నారు. హవెలి ఘనపూర్ మండలం కేంద్రంలో గ్రామ నడి వీధిలో పుట్టినరోజు జరిపినందుకు దాడి చేసారని జిల్లాలో గతంలోనూ అనేక దాడులు జరిగాయాన్ని భవిష్యత్తు లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని మంత్రిని కోరారు. ఈ కార్యక్రమం లో MRPS నాయకులు శ్రీకాంత్ పాల్గొన్నారు.



Comments
Post a Comment