శ్రీ వత్సల్ గురుకుల పాఠశాల బస్సు ప్రమాదానికి కారణం అయిన బాధ్యతలేని యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి


14.11.26: మెదక్, నర్సాపూర్: బాలల దినోత్సవం రోజునే పట్టణంలోని ఓ ప్రైవేటు విద్యా సంస్థ అయిన శ్రీ వత్సల్ గురుకుల పాఠశాలకు చెందిన స్కూల్ బస్ ప్రమాదానికి గురై చిన్నారుల్లో ఆందోళనకు కారణం అయ్యింది. సాయంత్రం పాఠశాల సమయం అయిపోయాక విద్యార్థులందరూ తమ తమ ఇండ్లకు వెళ్లడానికి బస్సు ఎక్కగా.. డ్రైవర్ ప్రభాకర్ బస్సును తోలుతూ.. కొద్ది దూరం నడిపి ఫిట్స్ కు గురయ్యాడు. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ఓ ఆటో, మూడు ద్విచక్ర వాహనాలను తగులుతూ ముందుకు దూసుకెళ్లింది. బస్సు చక్రాల కింద ఓ బైక్ పడడంతో బస్సు వేగం తగ్గగా.. బస్సులో ఉన్న క్లీనర్ అప్రమత్తమై బస్సును పూర్తిగా నిలిపివేశాడు. ఈ ప్రమాదంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురై ఏడుపులతో ఆహాకారాలు చేశారు. ఇది గమనించిన అక్కడ ఉన్న స్థానికులు బస్సులోని విద్యార్థులను కిందికి దింపేశారు. ప్రమాదం జరిగే సమయంలో బస్సులో 30 కి పైగా విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. బస్సు అదే విధంగా వెళ్ళి ఉన్నట్లు అయితే..ప్రక్కనే ఉన్న రెండు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ లను డీ కొట్టి ఉండేదని, అదే జరిగి ఉంటే చాలా ఘోరం జరిగి ఉండేదని స్థానికుల అభిప్రాయం. ఆరోగ్య పరిస్థితి బాగాలేని డ్రైవర్ను విధుల్లో పెట్టుకుని విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడిన శ్రీవత్సల్ గురుకుల పాఠశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments

Popular posts from this blog

న్యూ అమ్మ హాస్పటల్ సీజ్ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్

కూరగాయలు అమ్ముకొని ఇంటికి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి – నలుగురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ మహిళా ఉద్యోగి మృతి, అందిన పిర్యాదు మేరకు ప్రమాద కారణాలు అన్వేషిస్తున్న పోలీసులు