శివ్వంపేట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసి, పలు సూచనలు చేసిన తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్
23.11.26: మెదక్, శివ్వంపేట: తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులను, పరిసరాలను మరియు సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. డీఎస్పీ పరిశీలించిన ముఖ్యాంశాలు:
* స్టేషన్ పరిధిలోని క్లోజ్డ్ క్రైమ్ ఫైల్స్ మరియు కోర్టులో విచారణలో ఉన్న పెండింగ్ ట్రయల్ కేసుల వివరాలను పరిశీలించారు.
* దర్యాప్తులో ఉన్న పెండింగ్ కేసుల పురోగతిని సమీక్షించారు.
* కానిస్టేబుల్ కిట్లు మరియు సిబ్బంది నిర్వహణ రికార్డులను తనిఖీ చేశారు.
* నేరాలకు సంబంధించిన వాహనాలు మరియు స్టేషన్ ఆవరణలో ఉన్న వారసులు లేని వాహనాలను పరిశీలించారు.
* సస్పెక్ట్ షీట్లు, రౌడీ షీట్లను సమీక్షించి, హిస్టరీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు.
సిబ్బందికి డీఎస్పీ ఆదేశాలు:
* పెండింగ్‌లో ఉన్న ఆస్తి నేరాల కేసులను త్వరితగతిన ఛేదించాలని ఆదేశించారు.
* పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, సకాలంలో పరిష్కరించాలని సూచించారు.
* హిస్టరీ షీట్లను సక్రమంగా నిర్వహిస్తూ, ఎప్పటికప్పుడు సమీక్షించాలని స్పష్టం చేశారు.
* ప్రజల నుండి వచ్చే ప్రతి డయల్-112 కాల్‌కు తక్షణమే స్పందించి, సమర్థవంతమైన సేవలు అందించాలన్నారు.
* పోలీస్ స్టేషన్ పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని మరియు సిబ్బంది అందరూ క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. ఇట్టి కార్యక్రమంలో తూప్రాన్ సిఐ వెంకటరాజు గౌడ్ మరియు శివంపేట ఎస్సై మధుకర్ రెడ్డి, HC లు, కానిస్టేబుల్ లు, హోమ్ గార్డ్ లు తదితరులు పాల్గొన్నారు.


Comments
Post a Comment