గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు, సద్వినియోగం చేసుకొని జీవితాలలో వెలుగులు నింపుకోవాలన్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి



 14.11.26: మెదక్: జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు వారం రోజుల పాటు ఈ వారోత్సవాలను నిర్వహించనున్నారు. తొలిరోజు కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి వారోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మెదక్ మున్సిపల్ చైర్మన్ కానుగు రాధిక భూపతిరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిలుముల సుహాసిని రెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞానాన్ని అందించే దేవాలయాలని, విద్యార్థులు, యువత పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని అన్నారు. చదువు ద్వారా వ్యక్తిత్వ వికాసంతో పాటు సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిలో పఠనాసక్తిని పెంపొందించడమే గ్రంథాలయ వారోత్సవాల ప్రధాన లక్ష్యమని తెలిపారు.

నవంబర్ 14 నుంచి 20 వరకు నిర్వహించే ఈ వారోత్సవాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, నాయకులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

న్యూ అమ్మ హాస్పటల్ సీజ్ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్

కూరగాయలు అమ్ముకొని ఇంటికి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి – నలుగురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ మహిళా ఉద్యోగి మృతి, అందిన పిర్యాదు మేరకు ప్రమాద కారణాలు అన్వేషిస్తున్న పోలీసులు