గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి – ప్రమాద సమాచారం తెలిసిన వారు తెలుపుటకు పోలీసుల విజ్ఞప్తి

 


23.11.26: మెదక్, నర్సాపూర్: పట్టణంలోని NH-765D జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 64 సంవత్సరాల వృద్ధుడు మృతి చెందిన ఘటనపై నర్సాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. నర్సాపూర్ పట్టణంలోని శివాలయం వీధికి చెందిన వడ్డె ఎల్లయ్య తండ్రి క్రీ. శే. సలయ్య, వయస్సు; 64 సం ,, వృత్తి: లేబర్, కులం; వడ్డె; నివాసం; శివాలయం స్ట్రీట్, నర్సాపూర్ టౌన్, మెదక్ జిల్లా, ఈ నెల 22.11.2026 రాత్రి సుమారు 11:00 గంటల సమయంలో తన TVS XL ద్విచక్ర వాహనం పై సిగరెట్ కొనుగోలు చేసేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.

ఈ క్రమంలో 23.11.2026 నాడు రాత్రి సుమారు 02:45 గంటల సమయంలో చౌరస్తా నుండి మెదక్ రోడ్డులో బాలాజీ ఫుట్‌వేర్ షాపు ఎదురుగా, ఆ వైపు వెళ్లే NH-765D రహదారిపై గుర్తుతెలియని వాహనం ఆయన ద్విచక్ర వాహనాన్ని ఢీకొని, తలకు, కుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన వాహనం ఆగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ఎల్లయ్యను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని తదుపరి చట్టపరమైన ప్రక్రియ నిమిత్తం మార్చురీకి తరలించారు.

ఈ ఘటనపై మృతుడి కుమారుడు వడ్డె అంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నర్సాపూర్ పోలీస్ స్టేషన్‌లో యస్.ఐ. ఏ రంజిత్ కుమార్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు, మరియు ప్రమాదానికి కారణమైన గుర్తుతెలియని వాహనాన్ని, దాని డ్రైవర్‌ను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సంఘటనా స్థల పరిసరాల్లోని CCTV ఫుటేజీని పరిశీలించడం ద్వారా ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించి, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకో నున్నట్లు తెలిపిన పోలీసులు ఈ ప్రమాదానికి సంబంధించి ఎవరికైనా, ఎటువంటి సమాచారం తెలిసి ఉన్నా లేదా ప్రమాద సమయంలో ఆ మార్గంలో ప్రయాణించిన వాహనాలకు సంబంధించిన వివరాలు, CCTV దృశ్యాలు అందుబాటులో ఉంటే తమకు అందజేయాలని, సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు క్షతగాత్రులకు తక్షణ సహాయం అందించాలి. అలా కాకుండా ప్రమాదానికి కారణమై, వాహనంతో సహా అక్కడి నుంచి పరారవడం చట్టరీత్యా నేరం. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని పోలీసులు సూచిస్తున్నారు.

Comments

Popular posts from this blog

న్యూ అమ్మ హాస్పటల్ సీజ్ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్

కూరగాయలు అమ్ముకొని ఇంటికి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి – నలుగురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ మహిళా ఉద్యోగి మృతి, అందిన పిర్యాదు మేరకు ప్రమాద కారణాలు అన్వేషిస్తున్న పోలీసులు